ఈ నెల 30వ తారీఖు నుంచి ఆసియా కప్ లో పాల్గొనే టీమిండియా జట్టును నేడు ( సోమవారం ) సెలక్టర్లు ఎంపిక చేశారు. 17 మందితో కూడిన ఈ బృందంలో స్పిన్నర్ యుజువేంద్ర చహల్ కు స్థానం దక్కలేదు. ఆసియా కప్ కు ఎంపిక చేసిన జట్టునే దాదాపుగా స్వదేశంలో జరుగనున్న వన్డే వరల్డ్ కప్ 2023లోనూ ఆడించే ఛాన్స్ అధికంగా ఉంది. దీంతో ప్రపంచ కప్ లో చహల్ ఆడే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. చహల్ ను కాదని మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి ఎంపిక చేశారు. చైనామాన్ స్పిన్నర్ తో పాటు ఆల్ రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లకు అవకాశం దక్కింది.
Read Also: Gandeevadhari Arjuna: పవర్ ఫుల్ యాక్షన్ తో అదరగొట్టిన వరుణ్ తేజ్
ఆసియా కప్ లో తనకు స్థానం దక్కుతుందని చహల్ అనుకున్నాడు. కానీ తన ఆశ నిరాశ కావడంతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఎవరిని ఒక్క మాట అనలేదు.. కేవలం రెండు ఎమోజీలతో కూడిన ఓ ట్వీట్ ను చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు చహల్ ఏం పోస్ట్ చేశాడో తెలుసా..? ఆ రెండు ఎమోజీలు ఇలా ఉన్నాయి.. మబ్బుల చాటున దాగి ఉన్న సూర్యుడు ఎమోజీతో పాటు మబ్బులు తొలగిన తరువాత ప్రకాశించే సూర్యుడి ఎమోజీలను పోస్ట్ చేశాడు.
Read Also: Mamata Banerjee: మోడీకి ఇంకా ఆరు నెలలే మిగిలి ఉంది.. ప్రధానిపై విమర్శలు
సూర్యుడి ప్రకాశాన్ని ఎవ్వరూ ఆపలేదు.. మబ్బులు కొంతసేపే ఆపగలవు.. సూర్యుడి మళ్లీ ఉదయిస్తాడు అనే మీనింగ్ వచ్చేలా చహల్ పోస్ట్ చేశాడు. త్వరలోనే నీకు మంచి రోజులు వస్తాయి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ అతడికి సపోర్ట్ ఇస్తున్నారు. టీమ్ లో చహల్ ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించారు. జట్టులో 17 మందికే స్థానం ఉందని.. అందుకనే చహల్ ను ఎంపిక చేయలేదని చెప్పారు. వన్డే వరల్డ్ కప్ కు అతడికి ఇంకా దారులు మూసుకుపోలేదని తెలిపారు. టీమ్ లో ఇద్దరు రెస్ట్ స్పిన్నర్లకు ఓకేసారి ఛాన్స్ ఇవ్వలేమని చీఫ్ సెలక్టర్ అగార్కార్ అన్నారు. చహల్ కంటే కుల్దీప్ మెరుగ్గా రాణించడంతో అతడిని ఎంపిక చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో చహల్ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
⛅️——> 🌞
— Yuzvendra Chahal (@yuzi_chahal) August 21, 2023