వన్డే ప్రపంచ కప్ 2023 కోసం టీమిండియా 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. చివరలో అక్షర్ పటేల్ స్థానంలో ఆర్.అశ్విన్ జట్టులోకి వచ్చాడు. అంతకుముందు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కు గాయం కావడంతో.. ఇంకా కోలుకోలేదు. దీంతో అశ్విన్ జట్టులో చేరాడు. అయితే అశ్విన్ టీమ్ లోకి రావడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జట్టు కోసం అశ్విన్ ఎంపిక చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అక్షర్ స్థానంలో అశ్విన్‌ని చేర్చడం పట్ల తాను సంతోషంగా లేనని చెప్పాడు. అంతేకాకుండా.. అక్షర్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్ లేదా వాషింగ్టన్ సుందర్‌ను చేర్చాల్సి ఉందని తెలిపాడు.
IND vs ENG: ఇండియా-ఇంగ్లాండ్ వార్మప్ మ్యాచ్కు వర్షం అడ్డంకి..
జట్టులో లెగ్ స్పిన్నర్ లేని లోటు ఉందని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు యూవీ చెప్పాడు. ప్రపంచ కప్ జట్టులో యుజ్వేంద్ర చాహల్ పేరు కానీ వాషింగ్టన్ సుందర్ పేరు ఉండాలని తెలిపాడు. అయితే జట్టుకు సీనియర్ బౌలర్ అవసరం కోసం.. అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు కావచ్చని యువరాజ్ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా గురించి మాట్లాడుతూ.. దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి చేరిన జస్ప్రీత్ బుమ్రా మంచి ప్రదర్శన చూపిస్తున్నాడని తెలిపాడు.
బుమ్రా మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ అని యువరాజ్ అన్నాడు. 2011లో జహీర్ ఖాన్ పోషించిన పాత్రను బుమ్రా పోషించగలడని చెప్పుకొచ్చాడు. గాయం తర్వాత ఇలా పునరాగమనం చేయడం అంత సులభం కాదని.. కానీ బుమ్రా మెరుపు వేగంతో బౌలింగ్ చేస్తున్నాడని అన్నాడు.
MS Dhoni: మహీ భాయ్ ఐ లవ్ యూ.. అభిమాని పిలుపుకు మిస్టర్ కూల్ ఎలా స్పందించాడంటే..!
ఇక వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్ గురించి ఎలా ఉందంటే.. అక్టోబరు 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 11న ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్, 14న అహ్మదాబాద్ లో భారత్-పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.