వానపాములా పడకుంటే.. తాచు పాములా సీఎం కేసీఆర్ కాటేస్తున్నాడని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. G.O.317-సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య పంచాయితీ పెట్టిందని వైఎస్ షర్మిల అన్నారు. భార్యా భర్తలను విడదీసిందని… .9 మందికి పైగా ఉద్యోగుల ప్రాణాలను బలితీసుకొందని సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా దొర తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్టు ఉందని.. G.O.ను మాత్రం రద్దు చేయడం లేదని ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు.…
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. అధికారపార్టీ పై నిప్పులు చెరిగారు.కేసీఆర్‌కు చేతనైందల్లా గలీజు తిట్లు.. గారడీ మాటలేనన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఏడున్నరేళ్లలో 8 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ బతికే అవకాశం లేకుండా చేస్తున్నారని షర్మిల అన్నారు.…
ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ పెడతారా? అంటూ ఎదురైన ప్రశ్నపై వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించిన తీరు.. ఇటు తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ చర్చగా మారింది.. రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎక్కడైనా పెడతాం.. అక్కడ పెట్టకూడదని ఏమైనా రూల్ ఉందా? అంటూ ఎదురుప్రశ్నించిన కాకరేపారు వైఎస్ షర్మిల.. అయితే, ఆమె వ్యాఖ్యలపై ఇవాళ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ షర్మిల ఎవరైనా.. ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చన్నారు..…
ఆయన ఎప్పుడు ఏ గట్టున ఉంటారో తెలియదు. ఇప్పటివరకు ఏ పార్టీలోనూ కుదురుగా లేరు. ఇప్పుడు కొత్త గూటికి చేరారు. అక్కడ ఎన్నిరోజులు ఉంటారో.. ఏమో? ఎందుకు పదే పదే కండువా మార్చేస్తున్నారు?ఆయనే గట్టు రామచంద్రరావు. ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన.. గతంలో కమ్యూనిస్ట్. లెఫ్ట్ పార్టీల హవా నడిచిన సమయంలో సీపీఎం నాయకుడిగా గళం వినిపించేవారు. 2008లో CPM నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించి సంచలనం రేపారు. అక్కడ నుంచి ఆయన పరిస్థితి ఎక్కే గుమ్మం దిగే…
ఈ మధ్యే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన గట్టు రామచంద్రరావు… ఇవాళ వైఎస్ షర్మిల సమక్షంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జాతీయ పార్టీలు ప్రత్యామ్నాయం కావని.. టీఆర్ఎస్‌కి వైఎస్సార్ తెలంగాణ పార్టీనే ప్రత్యామ్నాయంగా చెప్పుకొచ్చారు.. వైఎస్ షర్మిల చేస్తున్న పోరాటం.. బీజేపీ, కాంగ్రెస్‌లు చేయడం లేదన్న ఆయన.. తెలంగాణలో వైఎస్సార్ లెగసీ ఎక్కడకు పోలేదన్నారు.. వైఎస్సార్ కి జిరాక్స్ కాపిలా వైఎస్ షర్మిల కనిపిస్తున్నారు.. మహిళలకు ప్రాధాన్యత షర్మిల…
టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులు చనిపోతున్నా సీఎం కేసీఆర్‌లో చలనం రావడం లేదని ఆరోపించారు. జీఓ 317 యమపాశంతో ఓ ఉపాధ్యాయుడిని బలి తీసుకున్నారని, 317 జీఓ వల్ల ఉపాధ్యాయులు అయోమయంలో ఉన్నారన్నారు. రైతుల చావులు మారుమోగుతున్న తెలంగాణలో మరో మరణ మృదంగానికి తెరలేపాడు దొర. Read Also:సాంకేతిక ఫలాలు సామాన్యులకు అందాలి: కేటీఆర్ సీనియారిటీ చిచ్చు పెట్టి…
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ రావాలంటే దొర అహంకారాన్ని అణిచివేయాలని.. సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా తెలంగాణలో నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలపై ఆమె స్పందించారు. ట్విట్టర్ వేదికగా …కేసీఆర్ పాలనలో ఆత్మహత్యలు లేని రోజు ఎప్పుడొస్తుందని ప్రశ్నించారు. ఓ రోజు నోటిఫికేషన్స్ లేక చనిపోయే నిరుద్యోగి వంతు…ఓ రోజు పంట కొనకపోవడంతో చచ్చే రైతు వంతు… ఓ రోజు ధరణి…
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు లిక్కర్‌పై తాజాగా చేసిన కామెంట్లు వైరల్‌గా మారిపోయాయి.. ఇక, సోమువీర్రాజు వీడియోపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే.. అయితే, అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… సోషల్ మీడియా వేదికగా లిక్కర్ అమ్మకాలపై స్పందించిన ఆమె.. చీప్ లిక్కర్‌తో బీజేపీ.. ఖరీదైన మద్యంతో టీఆర్ఎస్ ప్రజలను దోచుకుంటున్నాయని ఫైర్…
రాజకీయ నాయకురాలు ఇందిరా శోభన్ శనివారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సామాన్యుల పార్టీ అని.. అందుకే తాను ఆ పార్టీలో చేరానన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని… బీజేపీ, టీఆర్ఎస్ ఒకే గొడుగు కింద పని చేస్తున్నాయని తెలిపారు. కేంద్రంలో బడా మోదీ, రాష్ట్రంలో…
తెలంగాణ రైతులు బాజాప్తాగా వరి వేయండని వైఎస్ షర్మిల అన్నారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఎడ్లూర్ ఎల్లారెడ్డిలో పర్యటించారు వైఎస్ షర్మిల. వడ్లు కొనకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు మున్నారు యాదయ్య కుటుంబాన్ని ఈ సందర్భంగా షర్మిల పరామర్శించారు. ఈ రైతు మరణానికి ప్రభుత్వమే కారణమని.. .ఓ వైపు రైతులను చంపుకుంటూ,మరోవైపు ధర్నాలు చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వానికి చావు డప్పు కొట్టాలని… వరి వేసుకోవడం…