ఈ మధ్యే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన గట్టు రామచంద్రరావు… ఇవాళ వైఎస్ షర్మిల సమక్షంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జాతీయ పార్టీలు ప్రత్యామ్నాయం కావని.. టీఆర్ఎస్‌కి వైఎస్సార్ తెలంగాణ పార్టీనే ప్రత్యామ్నాయంగా చెప్పుకొచ్చారు.. వైఎస్ షర్మిల చేస్తున్న పోరాటం.. బీజేపీ, కాంగ్రెస్‌లు చేయడం లేదన్న ఆయన.. తెలంగాణలో వైఎస్సార్ లెగసీ ఎక్కడకు పోలేదన్నారు.. వైఎస్సార్ కి జిరాక్స్ కాపిలా వైఎస్ షర్మిల కనిపిస్తున్నారు.. మహిళలకు ప్రాధాన్యత షర్మిల పార్టీలో పెరుగుతుందన్నారు..
Read Also: సంజయ్‌కి నా మాటగా చెప్పండి.. వర్రీ వద్దు.. మేం చూసుకుంటాం..!
మరోవైపు, బండి సంజయ్ ను రాజకీయంగా సీఎం కేసీఆర్ ఎందుకు హైలెట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు గట్టు రామచంద్రరావు.. బీజేపీతో దోస్తీ కోసమే సీఎం కేసీఆర్ తపన పడుతున్నారని ఆరోపించిన ఆయన.. అందుకే తెలంగాణలో బీజేపీని కేసీఆర్ హైలెట్ చేస్తున్నారని.. రానున్న రోజుల్లో బీజేపీ, కేసీఆర్ కలిసి పనిచేస్తారని జోస్యం చెప్పారు.. కాగా, తన రాజకీయ జీవితాన్ని కమ్యూనిస్టు పార్టీలో ప్రారంభించిన గట్టు రామచంద్రరావు.. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంత కాలానికి టీఆర్ఎస్‌లో చేరిన ఆయన.. ఈ మధ్యే టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా.. వైసీపీలో కీలకంగా పనిచేసిన.. ఇప్పుడు వైఎస్ కూతురు షర్మిల పెట్టిన పార్టీలో చేరి.. మళ్లీ ఆ ఫ్యామిలీకి దగ్గరయ్యారు గట్టు రామచంద్రరావు..