టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులు చనిపోతున్నా సీఎం కేసీఆర్‌లో చలనం రావడం లేదని ఆరోపించారు. జీఓ 317 యమపాశంతో ఓ ఉపాధ్యాయుడిని బలి తీసుకున్నారని, 317 జీఓ వల్ల ఉపాధ్యాయులు అయోమయంలో ఉన్నారన్నారు. రైతుల చావులు మారుమోగుతున్న తెలంగాణలో మరో మరణ మృదంగానికి తెరలేపాడు దొర.
Read Also:సాంకేతిక ఫలాలు సామాన్యులకు అందాలి: కేటీఆర్
సీనియారిటీ చిచ్చు పెట్టి G.O. 317 యమపాశంతో ఓ ప్రధానోపాధ్యాయుడుని బలి తీసుకొన్నాడు.G.O. 317తో ఆగమైతున్నామని ఉపాధ్యాయులు మొత్తుకుంటున్నా, ఉసురు తీసే పనిపెట్టుకున్నాడు. లేని సమస్యలను సృష్టిస్తూ.. ముఖ్యమంత్రి ఆడుతున్న రాక్షస క్రీడలో.. ఉపాధ్యాయులను బలిపశువులను చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలు, అహంకార పోకడలు పక్కనపెట్టాలన్నారు. మరొకరు చనిపోకముందే జీఓ 317ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు లేవనెత్తే అంశాలను పరిశీలించి.. శాస్త్రీయ పద్ధతిలో బదిలీలు చేపట్టాలని షర్మిల ట్విట్టర్ వేదికగా కోరారు.
రైతుల చావులు మారుమోగుతున్న తెలంగాణలో
— YS Sharmila (@realyssharmila) December 31, 2021
మరో మరణ మృదంగానికి తెరలేపాడు దొర.
సీనియారిటీ చిచ్చు పెట్టి G.O. 317 యమపాశంతో ఓ ప్రధానోపాధ్యాయుడుని బలి తీసుకొన్నాడు.
G.O. 317తో ఆగమైతున్నామని ఉపాధ్యాయులు మొత్తుకుంటున్నా, ఉసురు తీసే పనిపెట్టుకున్నాడు.
లేని సమస్యలను సృష్టిస్తూ.. 1/2 pic.twitter.com/MHH9itizZr