కేసీఆర్‌కు చేతనైందల్లా గలీజు తిట్లు.. గారడీ మాటలు: షర్మిల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. అధికారపార్టీ పై నిప్పులు చెరిగారు.కేసీఆర్‌కు చేతనైందల్లా గలీజు తిట్లు.. గారడీ మాటలేనన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఏడున్నరేళ్లలో 8 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ బతికే అవకాశం లేకుండా చేస్తున్నారని షర్మిల అన్నారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక కొందరు, యాసంగిలో వరి వద్దన్న కారణంగా మరి కొందరు మరణించారు. మరికొంత మంది రైతులు ధరణిలో భూమి కనిపించడం లేదని ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరందరి కుటుంబాలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అని చెప్పి కేవలం 3 లక్షల మందికి రూ. లక్ష చొప్పున మాఫీ చేశారు. మరో 36 లక్షల మందికి రుణాలు ఎగ్గొట్టాడు అంటూ ఫైర్ అయ్యారు. రైతు బంధు కింద ఎకరాకు రూ.5వేలు ఇచ్చి సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. . రైతు బంధుకు జై కొట్టి.. ఇన్ పుట్ సబ్సిడీ నై అంటున్నారు యంత్ర లక్ష్మి నై అంటున్నారని షర్మిల ఆరోపించారు.
వైయస్ఆర్ పాలనలో రైతులకు రుణమాఫీ చేశారు. ఉచిత విద్యుత్ అందించారన్నారు. వైయస్ఆర్ పాలనను మిగతా రాష్ట్రాలు అనుసరిస్తుంటే కేసీఆర్ మాత్రం.. నియంత పాలన సాగిస్తుడని దుయ్యబట్టారు. పరిపాలన చేతకాకే ఢిల్లీలో డ్రామాలు చేస్తున్నారని షర్మిల ధ్వజమెత్తారు. ఏడేండ్లలో 7వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ గారు ఒక్కరిని పరామర్శించలేదన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనమని చెబుతుంది. అటు కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని చెబుతుంది. రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే ఆ అంశాన్ని ఇరు పార్టీల లీడర్లు పక్కదారి పట్టించారన్నారు. పంట వేసుకునే హక్కు రైతుది. అది కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. రైతులు ఎంత పండిస్తారో, అంతా కొనాల్సిందే. కొన్న ధాన్యాన్ని పక్క రాష్ట్రానికి అమ్ముతారో, పక్క దేశానికి అమ్ముతారో, రా రైస్ చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ కొనాల్సిందేనని షర్మిల స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో ఇంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టని కేసీఆర్, హరియాణాలో చనిపోయిన రైతులకు మూడు రోజుల్లోనే మూడు లక్షలు ఇస్తాడట. వీరివి ప్రాణాలు కాదా ? వీరి బాధ్యత పట్టదా ? ముఖ్యమంత్రికి సిగ్గుంటే రాజీనామా చేసేవారన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
Read Also: బీజేపీ, ఆర్ఎస్‌ఎస్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నాయి: డి.రాజా
కేసీఆర్ నోరు విప్పితే బూతు పురాణం. సీఎం హోదాలో ఉండి గల్లీ లీడర్‌లా మాట్లాడుతున్నారు.సభ్య సమాజం తలదించుకునేలా సీఎం వ్యవహరిస్తున్నారన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా?సమాజం ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు మాటలు చెప్పడం కాదు. మంచి పనులు చేయడం ముఖ్యంప్రజల గుండెల్లో నిలిచిపోవడం ముఖ్యం. మీకు చైతనైతే అది చేయండి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మొనగాడు అయిపోరు అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ భాషలోనే మేం మాట్లాడాలంటే మాకు చేతకాక కాదు. మాకు ఇంగితజ్ఞానం ఉంది. ఈ రోజు చేతకాని ముఖ్యమంత్రి మాకొద్దని నినదిస్తున్నామన్నారు షర్మిల. కేసీఆర్ భాషలో చెప్పాలంటే చేతకాని సన్నాసి ముఖ్యమంత్రి మాకొద్దు.. ఉద్యోగాలు ఇ్వవడం చేతకాని సన్నాసి ముఖ్యమంత్రి మాకొద్దన్నారు. ఇకనైనా కేసీఆర్ ఆ పదవికి తగ్గట్టు , ఆ కుర్చీకి తగినట్టు మాట్లాడితే సమాజానికి బాగుంటుందన్నారు.
రూల్స్ ప్రతిపక్షాలకేనా మీకు వర్తించవా..?
మొన్న కేటీఆర్ గారు నల్లగొండలో కోవిడ్ రూల్స్ ఉల్లంఘించి ర్యాలీ తీశారు. ఆ తర్వాత భారీ మీటింగ్ పెట్టారు. 25వ తేదీకి కొవిడ్ జీవో ఇచ్చి.. దానిని జనవరి 2వ తేదీ వరకు పొడిగించారు. కేటీఆర్ మాత్రం 28వ తేదీన సభ నిర్వహించి, జీవో అమలులో లేదని అబద్దాలు చెబుతున్నారు. కొవిడ్ రూల్స్ టీఆర్ఎస్ లీడర్లకు వర్తించవా? ప్రతిపక్షాలకే వర్తిస్తాయా అంటూ ప్రశ్నించారు. రైతులకు భరోసా ఇచ్చేందుకు మేం రైతు ఆవేదన యాత్ర నిర్వహిస్తే అడుగడుగునా అడ్డుకున్నారు. ఆంక్షల పేరుతో ఇబ్బందులు పెట్టారు. మేం రూల్స్ ప్రకారమే యాత్ర నిర్వహిస్తామని చెప్పిన వినలేదు. పర్మిషన్‌ఇవ్వలేదని షర్మిల ఆరోపించారు.
Read Also: సోషల్ మీడియా ద్వారా విద్వేషాలను రెచ్చగొడుతున్నారు: సీపీ, సత్యనారాయణ
రూల్స్ పాస్ చేసేది టీఆర్ఎస్ లీడర్లే.. రూల్స్ బ్రేక్ చేసేది టీఆర్ఎస్ లీడర్లే. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే అధికారపార్టీ నాయకలుఉ ఆంక్షలు విధిస్తున్నారంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కొడుకు, వనమా రాఘవ ఒక కుటుంబాన్ని పొట్టన పెట్టుకుని దర్జాగా బయట తిరుగుతున్నా అధికార పార్టీ ఏం చర్యలు తీసుకోలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ పోలీసులను పని వాళ్లలా వాడుకుంటున్నారు. మీరు ప్రజా సేవకులు సేవకులు అనే విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలన్నారు. కేటీఆర్ ఎవరిని చెబితే వారిని అరెస్ట్ చేయడం.. పర్మిషన్లు ఇవ్వకపోవడం సరికారదన్నారు. ముఖ్యమంత్రి మంత్రులకు కాదు ప్రజలకు పోలీసులు జవాబుదారీగా ఉండాలన్నారు.
- Tags
- Farmers
- hyderabad
- kcr
- ktr
- political news
తాజావార్తలు
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: ప్రేమించిన అమ్మాయినే చంపేశాడు.. లవ్ స్టోరీలో ఇంత షాకింగ్ ట్విస్ట్ ఏంటి?.. ‘గజ’ టీజర్ అదిరిందిగా!
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్‌లో అసలైన సూపర్‌మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!