మంత్రి నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. నారా లోకేష్ అవకాశం వచ్చినప్పుడల్లా స్థాయిని మించి మాట్లాడుతున్నారు.. వైఎస్ జగన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.. కళ్లు నెత్తి మీదకి ఎక్కి... వాపును బలం అనుకుని ఒళ్లు బలిసి లోకేష్ మాట్లాడుతున్నాడు.. లోకేష్ నీ స్థాయి ఏంటో తెలుసుకో.. 2019లో పార్టీ ఓడిపోవడానికి మీరు కూడా ఒక కారణం అని గుర్తుంచుకోండి..
సామర్లకోట మున్సిపాలిటీలో సొంత పార్టీ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధం అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు.. మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి అనుమతి కోరుతూ కలెక్టర్ కి లేఖ రాశారు 22 మంది వైసీపీ కౌన్సిలర్లు..
Kakani Govardhan Reddy: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరుపై సందిగ్ధం నెలకొంది. నిన్న (బుధవారం) మరోసారి హైదరాబాద్ లో కాకాణికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. ఇంట్లో ఆయన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు
సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి.. P-4 అనే కొత్త మోసాన్ని మొదలుపెడతాడు. సమాజంలో ఉన్న 20 శాతం పేదవాళ్ల బాగోగులకు 10 శాతం మందికి అప్పగిస్తాడంట? రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా?
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో అక్రమ తవ్వకాలు.. ఖనిజం రవాణా.. పేలుడు పదార్థాల నిల్వకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదైన కేసుకు సంబంధించి మూడో సారి నోటీసులు ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు.
YS Jagan: ఇవాళ తాడేపల్లిలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పార్టీ అధినేత, మాజీ ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు.
అధికార కూటమి పార్టీల వేధింపులను తట్టుకుని నిలబడిన ప్రజాప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రేపు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో.. వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ ప్రత్యేకంగా భేటీకాబోతున్నారు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కేసులో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వల్లభనేని వంశీ రిమాండ్‌ను పొడిగించింది జిల్లా కోర్టు.. ఆత్కురులో 9 ఎకరాలు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని నమోదైన కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం..
తెల్ల రాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు చేపట్టకుండా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది.. ఈ కేసులో కాకాణి ఏ 4గా ఉన్నారు.. పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా.. కాకాణి సహకరించటం లేదని ప్రభుత్వం.. హైకోర్టుకి తెలియజేసింది..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మరోసారి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పరిపాలన చేసే సత్తా లేదని ఒక పెద్ద మనిషి చెప్తున్నారని అన్నారంటూ సెటైర్లు వేశారు..