Vangalapudi Anitha: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. రాప్తాడు పర్యటన మరోసారి అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.. అయితే, నిన్నటి జగన్ టూర్ డ్రామాను తలపించింది.. ఏదో రకంగా శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు అంటూ మండిపడ్డారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. వైసీపీ హయాంలో ఐపీసీ సెక్షన్ ప్రకారం కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం పోలీసులు వ్యవహరించారని విమర్శించారు.. ఇక, జగన్ పర్యటన కోసం 1100 మంది పోలీసులను పెట్టాం.. జగన్ వెళ్లే ప్రాంతం చాలా సెన్సిటివ్ ఏరియా.. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నాం.. కానీ, వాట్సాప్ లో రెచ్చగొట్టే మెసేజ్ పెట్టారు.. కావాలని ఓ సీన్ క్రియేట్ చేయాలని చూశారని మండిపడ్డారు.
Read Also: Thopudurthi Prakash Reddy: ఎస్సై సుధాకర్‌పై తోపుదుర్తి సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాల్లోకి రావాలనే..!
హెలిపాడ్ దగ్గరకు తోసుకుంటూ, నెట్టుకుంటూ వచ్చారు.. కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయి.. ఇంతచేసి పోలీసులను తప్పు పడుతున్నారు అని జగన్‌పై ఫైర్ అయ్యారు హోంమంత్రి అనిత.. 12.42 కిలో మీటర్ల రోడ్డు మార్గం కన్ఫర్మ్ అయ్యింది.. కొద్ది నిమిషాల్లో చాపర్ బయలుదేరిపోయింది.. ఇదంతా ఫ్రీ ప్లాన్.. ఇలా కూడా ఆలోచన చేస్తారా? అనిపించిందని వ్యాఖ్యానించారు. జగన్ మాట్లాడుతుంటే వైసీపీ 5 ఏళ్ల జగన్ అరాచక పాలన గుర్తుకొచ్చింది.. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన జనాలు మర్చిపోలేదు.. ముసుగులేసుకుని కస్టోడీయల్ టార్చర్ ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? ఇలాంటి సంస్కృతి మాది కాదు.. ఇప్పటి సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, హోంమంత్రి అనేక కేసులు ఉన్నాయి.. ఇవన్నీ ప్రశ్నించడంతో వల్ల పెట్టారు అని గుర్తుచేశారు.. ఖాకీ చొక్క ఊడదీస్తానని మాజీ సీఎం అనొచ్చా..? అని ప్రశ్నించారు.. వైసీపీ హయాంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు 2800 పై చిలుకు హత్యలు జరిగాయి.. ఇలా ప్రవర్తిస్తేనే 151 నుంచి 11 కి దిగిపోయావు.. నువ్వు మారకపోతే అవి కూడా రావు అని ఎద్దేవా చేశారు.. వైసీపీ వాళ్ల తీరు మారకపోతే చట్టం తని పని తను చేసుకుపోతుందన్నారు. ఇక, జగన్ ని వదిలి చాపర్ వెళ్లిపోవడంపైనా సమగ్ర దర్యాప్తు చేస్తాం అన్నారు.. పెందుర్తి ట్రాఫిక్ అంశంపైనా పోలీసులు తప్పులేదు.. అవన్నీ అవాస్తవాలు అని కొట్టిపారేశారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత..