ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన.. ఆ తర్వాత నిర్వహించిన ప్రజావేదికలో మాట్లాడుతూ.. వారసత్వంగా నాకు అప్పు వచ్చింది.. రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు.. అప్పులకు వడ్డీలు చెల్లించాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది.. సంక్షేమం, అభివృద్ధి సమానంగా చేస్తా అన్నారు..
YS Jagan: శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలం పాపిరెడ్డి పల్లిలో గత రెండు రోజుల క్రితం హత్యకు గురైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్ది పరామర్శించారు.
Elamanchili: అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మాన రాజకీయం కీలక మలుపు తిరిగింది. చైర్ పర్సన్ రమా కుమారిపై ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకునేందుకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు యోచిస్తున్నారు.
Visakha Mayor: గ్రేటర్ విశాఖపట్నం మేయర్ పై అవిశ్వాసం కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 19వ తేదీన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. అవిశ్వాస తీర్మానంపై ఇప్పటికే కార్పొరేటర్లకు కలెక్టర్ ఆఫీస్ సమాచారం వెళ్లింది.
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణీ గోవర్థన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈరోజు (ఏప్రిల్ 1న) నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు.
కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, తిరుమల శ్రీవారికీ నిద్ర లేకుండా పోతోందని మాజీ మంత్రి రోజా ఫైర్.. 'సంప్రదాయాల ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి.. కానీ, రోజుకు దాదాపు 10 వేల VIP బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యమిస్తూ స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నారని.. మరోవైపు సాధారణ భక్తుల దర్శనాలను తగ్గించారు..
కొడాలి నానిని ముంబై తరలించే అవకాశం ఉంది.. హార్ట్ స్టంట్ లేదా బైపాస్ సర్జరీ కోసం ముంబై తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందింది.. ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి తరలించే అవకాశం ఉంది. కొడాలి కి హార్ట్ లో మూడు వాల్స్ క్లోజ్ కావడంతో సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం.. హార్ట్ స్పెషల్ హాస్పిటల్ అయిన ముంబై బాంద్రా లోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో సర్జరీ చేయించాలని…
ఈ రోజు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు హైదరాబాద్‌కు వెళ్లారు నెల్లూరు పోలీసులు.. నిన్న సాయంత్రం నెల్లూరులోని ఇంట్లో కాకాణి లేకపోవడంతో గేట్‌కు నోటీసులు అంటించారు పోలీసులు.. ఇక, హైదరాబాద్‌లోని ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉగాది జరుపుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్టారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. దీంతో, కాకాణి.. హైదరాబాద్ లో ఉన్నారనే సమాచారంతో అక్కడికే బయల్దేరి వెళ్లారు..
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు ఇంటికి చేరుకున్నారు. గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా కొడాలి నాని మొదట ఆసుపత్రిలో చేరగా, పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు వాల్స్ క్లోజ్ అయ్యాయని నిర్ధారణ అయ్యింది. దీంతో స్టంట్ లేదా…
నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట హాజరుకావాలని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి పోలీసుల నోటీసులు.. కాకాణి ఇంట్లో లేకపోవడంతో గేట్ కు నోటీసులు అంటించిన పోలీసులు.. అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా కాకాణి గోవర్థన్ రెడ్డిని చేర్చిన పోలీసులు..