YS Jagan: శ్రీ సత్యసాయి జిల్లాలోని రాప్తాడు నియోజక వర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డి పల్లిలో ఇటీవల హత్యకు గురైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని ఈ రోజు (ఏప్రిల్ 8న) మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో రానున్నారు. ఉదయం 10.40 గంటలకు సత్యసాయి జిల్లా సీకే పల్లి చేరుకుని అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లికి వెళ్లనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు హెలికాఫ్టర్ లో తిరిగి బెంగుళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
Read Also: Rishab Shetty : ప్రమాదంలో రిషబ్ శెట్టి కుటుంబం.. దెబ్బతీసే కుట్ర జరుగుతోంది !
ఇక, వైఎస్ జగన్ వస్తుండటంతో రామగిరిలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తులో మూడు జిల్లాలకు చెందిన ఎస్పీలు విధులు నిర్వహిస్తున్నారు. వీవీఐపీలకు తప్ప మిగిలిన వారికి గ్రామంలోకి అనుమతి లేదన్న పోలీసులు వెల్లడించారు. అయితే, పాపిరెడ్డి పిల్లిలో వైఎస్ జగన్ వస్తుండటంతో కార్యకర్తలు తరలి రావాలని వైసీపీ నాయకులు మరో వైపు పిలుపునిచ్చారు.