YS Jagan Helicopter Damaged: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు.. ఇటీవల హత్యకు గురైన పార్టీ నేత కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు.. అయితే, రాప్తాడు పర్యటనకు వచ్చిన జగన్ హెలికాప్టర్ డ్యామేజీ అయ్యింది.. జగన్ వస్తున్నాడని తెలిసి.. భారీగా తరలివచ్చారు వైసీపీ కార్యకర్తలు.. ఇక, హెలిప్యాడ్ దగ్గర జగన్ వచ్చిన హెలికాప్టర్ దిగగానే.. దాని మీదకు దూసుకుపోయారు.. దీంతో.. స్వల్పంగా హెలికాప్టర్ దెబ్బతింది.. ఈ పరిణామాలతో తిరిగి బెంగళూరు అదే హెలికాప్టర్‌లో వెళ్లడం ప్రమాదమని జగన్‌కు సూచించారు పైలట్లు. దీంతో రోడ్డు మార్గాన బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు వైఎస్ జగన్..
Read Also: ‘Toxic’ : రాఖీబాయ్ మూవీని తక్కువంచనా వేస్తున్నారా..!
అయితే, హెలిపాడ్ దగ్గర సరిపడంత సెక్యూరిటీ లేకపోవడం, భారీగా తరలివచ్చిన కార్యకర్తలు హెలికాప్టర్ మీదకు తోసుకు రావడంతోనే ఈ ఘటన జరిగిందంటున్నారు వైసీపీ నేతలు.. జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తగినంత భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.. గతంలో గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు వెళ్లిన సమయంలోనూ జగన్ కు సెక్యూరిటీ ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు.. దీనిపై ఇప్పటికే రెండసార్లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు వైఎస్ జగన్.. ఇప్పుడు రాప్తాడు పర్యటనలో.. ఏకంగా హెలికాప్టర్ డ్యామేజ్ కావడంతో.. రోడ్డు మార్గంలో బెంగళూరుకు పయనం అయ్యారు.. ఇప్పటికే జగన్ సెక్యూరిటీపై ప్రభుత్వం ఆలోచించాలంటున్నారు.