Elamanchili: పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి మున్సిపాలిటీ రాజకీయం ఒక్కసారిగా కీలక మలుపు తిరిగింది. భారతీయ జనతా పార్టీలో చేరిన ఛైర్ పర్సన్ పై వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది.
YSRCP vs TDP: పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి ఎంపీపీ ఎన్నికలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం వద్ద వైసీపీ నేతలతో ఎన్డీయే కూటమి నాయకులు వాగ్వాదానికి దిగారు.
Katrenikona MPP Election: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన ఎంపీపీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. వైసీపీ ఎంపీటీసీలు సామాజిక వర్గాలుగా విడిపోయారు.
Kadapa ZP Chairman: నేడు ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 11 గంటలకు చైర్మన్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు అనంతరం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు చైర్మన్ ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు.
మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారట.. హైదరాబాద్లో ఉన్న కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు.. ఛాతిలో నొప్పిరావడంతో.. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
ఉమ్మడి కడప జిల్లా.. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక వివాదం ఇప్పుడు హైకోర్టు వరకు చేరింది.. జడ్పీ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలంటూ గోపవరం జడ్పీటీసీ జయరాం రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కడప జిల్లాలో ఖాళీగా ఉన్న రెండు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు.
రేపు చంద్రగిరిలో ఒక ఎంపీపీ , రెండు వైస్ సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి రూరల్ (మం) ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఎంపీపీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. చంద్రగిరి (మం) రామిరెడ్డిపల్లిలో ఉప సర్పంచ్ ఉమ, యర్రావారిపాళెం, చింతకుంట ఉప సర్పంచ్ రమేష్ నాయుడు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. READ MORE: CM Chandrababu: ఇవాళ రెండో రోజు కలెక్టర్ల…
కడప మేయర్ సురేష్బాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే మాధవి.. అవినీతి అక్రమాలకు పాల్పడిన మేయర్ సురేష్ బాబు పై చర్యలు తప్పవని హెచ్చరించారు.. అధికారం ఉందని అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. మేయర్ అవినీతి అక్రమాలు చేశారని ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఆయన సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
మాజీ సీఎం జగన్ తన స్ట్రాటజీలు మారుస్తున్నారట.. పార్టీతో పాటు పార్టీ కార్యాలయాల్లోనూ కీలక మార్పులు చేపట్టబోతున్నారట.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఆ కీలక మార్పులను చూడవచ్చంటున్నారట..
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ నుంచి అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలించారనే ఆరోపణలతో కాకాని గోవర్ధన్ రెడ్డిపై.. పోలీసులు కేసు పెట్టారు.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్ నుంచి దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది.