ఏపీ సీఐడీ నోటీసులు.. ఘాటుగా స్పందించిన ఎంపీ రఘురామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు ఇవాళ నోటీసులు అందజేశారు ఏపీ సీఐడీ అధికారులు… గతంలో ఆయనపై నమోదైన కేసులకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఐడీ అధికారులు రఘురామ కృష్ణరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.. రఘురామకృష్ణరాజుపై 124(A), 153(B), 505 IPC, 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడీ.. ఇవాళ హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు.. ఈ నెల 17వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, సీఐడీ నోటీసులపై తీవ్రంగా స్పందించారు ఎంపీ రఘురామ కృష్ణరాజు.. సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.. ఈ నెల 17న విచారణకు హాజరవుతానన్న ఆయన.. నేను చట్టాలను అనుసరిస్తాను… గతంలో నన్ను అరెస్ట్ చేసే సమయంలో సీసీటీవీ కెమెరాలు లేకుండా చేశారు.. నా సిబ్బందిపై, నా పై వ్యక్తి గతంగా దాడి చేశారు.. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన వివరాలు సమర్పించాను అన్నారు. ఇక, సీఐడీ అధికారి సునీల్ ఒక ఉన్మాది.. అంటూ మండిపడ్డ ఎంపీ.. ఇదంతా చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆనంద పడుతున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: టీడీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..
Also Read
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
- Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
12 ఆఫ్ 2021 కేసులో నాకు నోటీసులు ఇచ్చారు.. రాజు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తే రాజా ద్రోహం కేసులు పెడతారా…? అని ప్రశ్నించారు ఎంపీ రఘురామ.. వ్యక్తి గత కక్షలో భాగంగా నాకు నోటీసులు ఇచ్చారు అని ఆరోపించారు. ఇక, ముఖ్యమంత్రి జగన్ పేదలకు భూములు ఇస్తున్నట్లు నిన్న బ్రోచర్ విడుదల చేసారు… రియల్ ఎస్టేట్ చేస్తున్నట్లు నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు అని సెటైర్లు వేశారు.. 175 నియోజకవర్గాల్లో జగన్ అన్న ఇల్లులు ఇస్తాడట.. రోడ్లు వేయడానికి డబ్బులు ఉండవు.. కానీ, ఇల్లులు ఎలా ఇస్తారు..? అని ప్రశ్నించారు.. ఇవి మొత్తం దగా లే అవుట్లేనని ఆరోపించిన ఆయన.. ప్రజలందరూ ఆలోచించాలి.. ఇది ప్రజలను మరో మోసానికి పాల్పడుతున్న చర్యలు మాత్రమేనని ఆరోపించారు.. ఇక, ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత నేను ఓ నిర్ణయం తీసుకుంటాను.. ఏపీలో ఉన్న పార్టీలు, ప్రజలందరూ ఒకటి కావాలని పిలుపునిచ్చారు.. ఫిబ్రవరి 5వ తేదీ వరకు తాను ఎదురు చూస్తానని తెలిపారు ఎంపీ రఘురామకృష్ణరాజు.
తాజావార్తలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
-
Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
ట్రెండింగ్
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!