నేడు టీడీపీ అధినేత కుప్ప నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన మాట్లాడుతూ వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా రెండు ఘటనలు కుప్పంలో నన్ను బాధించాయని ఆయన అన్నారు. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు నన్ను బాధపెట్టాయని, కుప్పంలో డబ్బులు పంచే తీరు ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. వెయ్యి, రెండు వేలు పంచి ఓట్లు అడిగే పార్టీ కాదు టీడీపీ అని, కుప్పంలో ఓటమి అంటూ నన్ను ఎగతాళి చేస్తే….మిమ్మల్ని అన్నట్లు కాదా..?…
కుప్పం నియోజకవర్గంలో ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. దేవరాజపురంలో భారీ ఎత్తున తరలివచ్చి టీడీపీ శ్రేణులు, అభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు గ్రామాల్లో పర్యటిస్తా…కార్యకర్తలు, ప్రజలను కలుస్తానని ఆయన తెలిపారు. నేను ఎప్పుడూ కుప్పం అభివృద్ధి గురించే ఆలోచించానని, నిత్యావసరాలు తీవ్ర భారంగా మారిపోయాయని ఆయన అన్నారు. పొరుగున ఉన్న రాష్ట్రంలో పెట్రో ధరలు 10 రూపాయలు తక్కువగా ఉందని, ఎవడబ్బ సొమ్మని ఓటీఎస్‌కు 10…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఈ సారి లేఖలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు వ్యవహారాన్ని ప్రస్తావించారు.. పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, వారి దీక్షలు విరమింపజేయాలని లేఖలో కోరిన ఆయన.. అందరికీ చట్టప్రకారం పునరావాసం కల్పించాలని కోరారు.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందరికీ ఇవ్వాలని కోరిన ఆయన.. సీఎం వైఎస్ జగన్ గతంలో ప్రకటించి రూ. 10 లక్షల ప్యాకేజీ…
తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తాజా పరిణామాలపై గుర్రుగా వున్నారు. నా వెనుక కొంత మంది కుట్రలు పన్నుతున్నారు.గత ఎన్నికల నుంచి కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి…ఈ లుకలుకలు ఇప్పుడు బయట పడ్డాయన్నారు. నా ఫ్లెక్సీలు నేనే వేసుకోను.. కార్యకర్తలే వేస్తారు. లోకల్ ఎమ్మెల్యే అయినా…వంకా రవి ఫ్లెక్సీల్లో నా బొమ్మ వేయలేదు. వంకా రవి పార్టీ పక్కన పెట్టిన సాయిరాం అనే వ్యక్తిని తీసుకుని వచ్చి పెన్షన్ల కార్యక్రమం చేపట్టాడు. అందుకే నేను చిరాకు పడ్డాను.…
ఆయనది ఆ జిల్లా కాదు. కానీ.. ఎన్నికల సమయంలో పార్టీ ఆదేశాలతో మరో జిల్లాకు వెళ్లి.. పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అప్పట్లో ఆయనకు జైకొట్టిన పార్టీ కేడరే ఇప్పుడు రివర్స్. పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యేలకు గ్యాప్ వచ్చిందని టాక్. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటా లొల్లి? రెండున్నరేళ్ల తర్వాత సంతనూతలపాడు వైసీపీలో లుకలుకలుటీజేఆర్ సుధాకర్‌బాబు. ప్రకాశంజిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్‌బాబు గత ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు అభ్యర్థిగా వైసీపీ…
ఏపీ సర్కార్, సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర విభజన కంటే వైఎస్ జగన్ చేసిన డామేజ్ నుంచి రాష్ట్రం కోలుకోవడం చాలా కష్టం అన్నారు.. కరోనా వైరస్‌కి మందుందేమో కానీ.. జగన్ వైరస్‌కి మందు లేదని మండిపడ్డారు.. ఏపీ అప్పు రూ. 7 లక్షల కోట్లకు చేరిందన్న బాబు.. ఉద్యోగులకు చరిత్రలో ఎవ్వరూ ఇవ్వనంత ఫిట్మెంట్ టీడీపీనే ఇచ్చిందన్నారు.. చెత్త మీద పన్నేసిన చెత్త ప్రభుత్వం…
ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ పెడతారా? అంటూ ఎదురైన ప్రశ్నపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించిన తీరు.. ఇటు తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ చర్చగా మారింది.. రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎక్కడైనా పెడతాం.. అక్కడ పెట్టకూడదని ఏమైనా రూల్ ఉందా? అంటూ ఎదురుప్రశ్నించిన కాకరేపారు వైఎస్ షర్మిల.. అయితే, ఆమె వ్యాఖ్యలపై ఇవాళ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ షర్మిల ఎవరైనా.. ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చన్నారు..…
ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళను కాపాడి మానవత్వం చాటారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మణిపురం ఫ్లై ఓవర్ పై ఆత్మహత్యాయత్నం చేసింది శ్రీనివాసరావుపేటకు చెందిన ఓ వివాహిత… స్థానికులు ఎంత సర్దిచెప్పినా వినిపించుకోలేదు ఆమె.. అయితే, ఇంటికి వెళ్తూ సదరు మహిళను గమనించిన ఎమ్మెల్యే ముస్తాఫా.. తన కారు ఆపి.. మహిళకు సర్ది చెప్పారు.. ఆ మహిళ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.. ఇక, కారులో ఎక్కించుకుని సదరు మహిళను తన…
ఆయన ఎప్పుడు ఏ గట్టున ఉంటారో తెలియదు. ఇప్పటివరకు ఏ పార్టీలోనూ కుదురుగా లేరు. ఇప్పుడు కొత్త గూటికి చేరారు. అక్కడ ఎన్నిరోజులు ఉంటారో.. ఏమో? ఎందుకు పదే పదే కండువా మార్చేస్తున్నారు?ఆయనే గట్టు రామచంద్రరావు. ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన.. గతంలో కమ్యూనిస్ట్. లెఫ్ట్ పార్టీల హవా నడిచిన సమయంలో సీపీఎం నాయకుడిగా గళం వినిపించేవారు. 2008లో CPM నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించి సంచలనం రేపారు. అక్కడ నుంచి ఆయన పరిస్థితి ఎక్కే గుమ్మం దిగే…
ఏపీ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 2ను ప్రవేశపెట్టింది. పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఈ జీవోను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. అయితే ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సర్పంచులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. జీవో నెంబర్ 2 పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో సర్పంచుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు గతంలోనే జీవో నెంబర్ 2ను సస్పెండ్ చేసింది. అయితే దీనిపై మరోసారి హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.…