వివేకానంద జయంతిని పురస్కరించుకొని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వివేకానందకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ యువతరంలో చైతన్యం నింపడానికి, ఆత్మ విశ్వాసం కలిగించడానికి తన జీవితమంతా కృషి చేసిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ మహాశయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నానన్నారు. జాతీయ యువజనోత్సవ దినం సందర్భంగా లోకేష్ యువతకు శుభాకాంక్షలు తెలిపారు.
సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరమన్నారు వివేకానంద, ఏపీలో యువత నిరాశ, నిస్పృహలో కూరుకుపోయి ఉందని లోకేష్ వ్యాఖ్యానించారు. జాబ్ కాలెండర్ రాదు.. పరిశ్రమలు రావు.. ఈ ప్రభుత్వానికి యువతరమే బుద్ధి చెప్పే రోజు త్వరలో రానుందని, అప్పుడు నిజమైన యువజనోత్సవాలను ఘనంగా చేసుకుందాం. అప్పటివరకు మార్పు కోసం కృషి చేద్దామని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.