సినిమా టికెట్ ధరలు తగ్గించి గొప్పలా..? సిమెంట్ ధరలు తగ్గించొచ్చుగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా చర్చ హాట్ టాపిక్‌గానే సాగుతోంది.. ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య నెలకొన్న వివాదానికి తెరదించేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. తాజాగా, సినిమా టికెట్ల వివాదంపై స్పందించిన బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.. రాంగోపాల్ వర్మను పిలిచి భోజనం పెట్టారు.. కానీ, విద్యార్ధుల కడుపు నింపే విషయాన్ని మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోదు అని మండిపడ్డారు.. సినిమా టిక్కెట్ల అంశంలో ప్రభుత్వం ఆలోచన ఏమిటి..? అని ప్రశ్నించిన ఆయన.. సినిమా టిక్కెట్ ధరలు ఒక్కటి తగ్గించి గొప్పగా చెప్పుకోవడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు.. ప్రజలపై అంత ప్రేమే ఉంటే సీఎం జగన్‌కు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే బస్తా ధరలు తగ్గించవచ్చు కదా..? అంటూ ప్రశ్నించారు సోము వీర్రాజు.
Read Also: సర్కార్ చేతిలోకి వొడాఫోన్-ఐడియా..!
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ధాన్యం కొనేవాళ్లులేక రైతులు గగ్గోలు పెడుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టదు అని మండిపడ్డారు సోము వీర్రాజు.. సీఎం వైఎస్ జగన్‌కు దమ్ముంటే రూ. 1400కి ధాన్యం కొనుగోలు చేసి చూపించాలని సవాల్ చేశారు.. నిత్యావసర వస్తువులు, ఇసుక, సిమెంట్ ధరలు కూడా తగ్గించాలని డిమాండ్ చేసిన ఆయన.. ఇవన్నీ ప్రజలకు అవసరం లేనివిగా భావిస్తున్నారా..? అని నిలదీశారు.. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న వాటి ధరలు గురించి మాత్రం మాట్లాడరా..? రెండు కోట్ల మంది ప్రజల గురించి ఆలోచించరా..? కానీ, వేల మంది చూసే సినిమా టిక్కెట్లు తగ్గించి గొప్ప పని చేసినట్లు ప్రగల్భాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ విషయంలో కనీసం సిగ్గు లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!