Nuwan Seneviratne: స్కూల్ బస్సు డ్రైవర్ నుంచి టీమిండియా ‘వరల్డ్ కప్’ హీరో వరకు.. ఎవరీ నువాన్ సెనెవిరత్నే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nuwan Seneviratne: మైదానంలో సిక్సర్లు కొట్టేది ఆటగాళ్లే కావచ్చు.. స్టేడియంలో కప్పు పట్టుకుని కేరింతలు కొట్టేది 15 మంది సభ్యులే కావచ్చు.. కానీ, ఆ విజయం వెనుక నెట్స్ లో రక్తం చిందించే ‘అజ్ఞాత వ్యక్తులు’ కొందరు ఉంటారు. టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడి ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తుంటే, ఆ విజయంలో ఒక ‘శ్రీలంక’ వ్యక్తి హస్తం ఉందంటే నమ్ముతారా. ఒకప్పుడు కుటుంబాన్ని పోషించుకోవడానికి కొలంబో వీధుల్లో స్కూల్ బస్సు నడిపిన డ్రైవర్, ఇప్పుడు భారత బ్యాటింగ్ దిగ్గజాలకు వెన్నుముకగా నిలిచారు. ఆయనే నువాన్ సెనెవిరత్నే. విరాట్ కోహ్లీ కంటిచూపుతో మొదలైన ఈ ప్రయాణం, ఈరోజు భారత్‌కు వరుసగా రెండు ప్రపంచకప్ ట్రోఫీలు అందించే స్థాయికి చేరింది. ఎడమచేతి వాటం బౌలర్లంటే భయపడే భారత బ్యాటర్లను ‘సింహాల్లా’ తయారు చేసిన ఈ ‘బవ్వా’ ప్రయాణం, కష్టాల నుంచి ప్రపంచ విజేత వరకు ఎలా సాగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
భారత క్రికెట్ జట్టు వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్ (2024, 2026) ట్రోఫీలను ముద్దాడటంలో తెరవెనుక ఉండి కీలక పాత్ర పోషించిన వ్యక్తి నువాన్ సెనెవిరత్నే. జట్టు సభ్యులందరూ ప్రేమగా “బవ్వా” అని పిలుచుకునే ఈయన, టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌లో ఎడమచేతి వాటం త్రో-డౌన్ స్పెషలిస్ట్‌గా సేవలందిస్తున్నారు. 2026 ప్రపంచకప్ విజయం తర్వాత నువాన్ సోషల్ మీడియాలో ట్రోఫీతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “2023 నాకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది, 2026 కొత్త జ్ఞాపకాలను సృష్టించింది. 2024, 2026.. వరుసగా రెండు ప్రపంచకప్ ట్రోఫీలు. టీమిండియా ఎప్పటికీ నా గుండెల్లో ఉంటుంది” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
భారత బ్యాటర్లకు బలం.. ఎడమచేతి వాటం స్పెషలిస్ట్
టీమిండియాకు పెద్ద బలహీనతగా ఉన్న ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో నువాన్ సెనెవిరత్నే కీలక పాత్ర పోషిస్తున్నారు. నెట్స్ ప్రాక్టీస్‌లో వివిధ కోణాల నుంచి, రకరకాల వైవిధ్యాలతో త్రో-డౌన్స్ విసురుతూ బ్యాటర్లను సిద్ధం చేస్తారు. ఈయన శిక్షణ వల్లే భారత బ్యాటింగ్ లైనప్ ఎడమచేతి వాటం బౌలర్ల ధాటిని సమర్థవంతంగా తట్టుకోగలుగుతోంది. శ్రీలంక మీడియా కూడా తమ దేశానికి చెందిన వ్యక్తి భారత్ విజయానికి ఇంతగా తోడ్పడటంపై ప్రశంసలు కురిపిస్తోంది. నువాన్ జీవిత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. 1979లో కొలంబోలో జన్మించిన ఆయన, 2004లో కేవలం రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగారు. క్రికెట్ కెరీర్ ముందుకు సాగకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడానికి కొలంబోలో స్కూల్ బస్సు డ్రైవర్‌గా పనిచేశారు. 2017లో భారత్ శ్రీలంక పర్యటనకు వెళ్ళినప్పుడు, నెట్స్‌లో నువాన్ వేస్తున్న త్రో-డౌన్స్‌ను విరాట్ కోహ్లీ గమనించారు. ఆయన ప్రతిభకు ఫిదా అయిన కోహ్లీ, అతడిని భారత జట్టులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 2018 ఆసియా కప్ నుంచి నువాన్ టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్‌లో అంతర్భాగంగా మారిపోయారు.
Sri Lankan 🇱🇰 born India’s 🇮🇳 left arm throw down specialist Udenaka Nuwan ( Bauwa) posted this in FB. #INDVNZ #T20worldcup pic.twitter.com/7uoCokDKq2
— Nibraz Ramzan (@nibraz88cricket) March 9, 2026
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!