ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోయినా.. ఓట్లు, సీట్ల గురించి సవాళ్లు, ప్రతి సవాళ్లు వినిపిస్తున్నాయి.. గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే.. ఈ సారి ఎక్కువగా వస్తాయని.. రాష్ట్రంలోని 175 స్థానాలకు 175 తామే గెలుస్తామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చెబుతున్నమాట.. అయితే.. రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 కాదు కదా.. 17 సీట్లు కూడా రావు అని జోస్యం చెప్పారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ…
అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సోమవారం మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేల పని తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో సీఎం జగన్‌కు పీకే టీమ్ వివరించింది. 10 రోజుల లోపు గడప గడపకు 22 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేలు…
YCP MP Vijaya Sai Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. ఈరోజు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అసెంబ్లీలో చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకోవడంపై విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం అయ్యేదాకా అసలు అసెంబ్లీ గడప తొక్కనని గతంలో చంద్రబాబు మంగమ్మ శపథం చేశాడని, ఇప్పుడు ఆ ఒట్టు తీసి గట్టున పెట్టేసి అసెంబ్లీకి వెళ్లి ఓటు వేశాడని విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. ఇకపై ఎప్పటికీ సీఎం కాలేనని…
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. నెలరోజులుగా టీడీపీ పనికిమాలిన చర్చ పెట్టిందని.. అదాన్ అనే కంపెనీ తనదేనని దుష్ప్రచారం చేస్తోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చెప్పిన అబద్ధం మళ్లీ మళ్లీ చెప్తే నిజమై పోతుందని టీడీపీ నమ్మకమని ఎద్దేవా చేశారు. శ్రీనివాస్ అనే వ్యక్తి తన అల్లుడు కంపెనీకి చెందినవాడని ఆరోపిస్తున్నారని.. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు చంద్రబాబు, లోకేష్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విదాన్ అటో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్…
కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.. గుడివాడలో రోడ్లకు మరమ్మత్తులు చేయాలంటూ కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నించారు జనసేన పార్టీ శ్రేణులు.. దీంతో, జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.. ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో.. కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. ఇక, జనసేన నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా.. తామేం నేరం చేశామంటూ ఎదురు తిరిగారు జనసైనికులు.. దీంతో, భారీగా పోలీసులను మోహరించారు..…
ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం ఏం చేసిందన్న దానిపై.. మేము చర్చకు సిద్ధమని సవాల్ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు మేం (కేంద్ర ప్రభుత్వం) బాకీలేము… ఆ ప్రాజెక్టును భ్రష్టుపట్టించారని మండిపడ్డారు.. పోలవరాన్ని కేంద్రం కట్టించి ఉంటే ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయ్యేది.. కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని ఆరోపించారు సోమువీర్రాజు… ఇక, ఈ సమయానికే పోలవరం పూర్తి అయిఉంటే మిగులు జలాలతో…