వైసీపీ ప్లీనరీ ద్వారా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతమాత్రం శ్రేయస్కారం కాదన్నారు. వైసీపీ నేతలు మాట్లాడే భాష కనీసం మర్యాదపూర్వకంగా ఉండటం లేదని.. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలన్నారు. వైసీపీ చేపట్టిన గడప గడపకు కార్యక్రమం ఫెయిల్యూర్ కావడంతో సీఎం జగన్ ఫస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. 1.27 లక్షల కోట్లు ఏపీలోని రైతాంగాన్ని ఆదుకున్నామని…
* గుంటూరు: నేడు రెండో రోజు వైసీపీ ప్లీనరీ సమావేశాలు.. వైసీపీ అధ్యక్షుడిగా మరోసారి వైఎస్ జగన్‌ను ఎన్నుకోనున్న ప్రతినిధులు, అధ్యక్ష నేటితో ముగియనున్న ప్లీనరీ * నేడు బర్మింగ్‌హామ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య సెకండీ టీ-20 మ్యాచ్ * నేడు కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం-వాతావరణశాఖ * హైదరాబాద్‌లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం.. రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ, హైదరాబాద్‌తో పాటు…
ఆంధ్రప్రదేశ్‌లో పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు సాగుతున్నాయి.. తొలిరోజు అత్యంత ఉత్సాహవంతమైన వాతావరణంలో.. ఫుల్ జోష్‌లో ఈ సమావేశాలు సాగాయి.. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ దగ్గర జరుగుతోన్న ప్లీనరీ సమావేశాలు తొలిరోజు విజయవంతం కాగా.. రేపు రెండో రోజుతో ప్లీనరీ సమావేశాలు ముగియనున్నాయి.. తొలిరోజు నాలుగు తీర్మానాలు పెట్టి ఆమోదింపజేశారు.. ఇక, పార్టీ చీఫ్, సీఎం వైఎస్ జగన్, విజయమ్మ, మంత్రుల ఉపన్యాసాలు ఆకట్టుకోగా.. రెండోరోజు నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను…
బిడ్డా ఈ రాష్ట్రం వైసీపీ, జగనన్న అడ్డా.. ఎవ్వరి ఆటలు సాగవు అని హెచ్చరించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. గుంటూరులో జరుగుతోన్న వైసీపీ ప్లీనరీలో మాట్లాడిన ఆయన.. టీడీపీ, చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం నేతలు నొటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. రోషం గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. బాబు ఆయన దత్తపుత్రుడి ఆటలు సాగవని హెచ్చరించిన ఆయన.. బిడ్డా ఈ రాష్ట్రం వైసీపీ అడ్డా.. తాము…
రెండు రోజుల పాటు జరుగుతోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరుగుతున్నాయి.. సాయంత్రం 5 గంటల తర్వాత తొలిరోజు ప్లీనరీ సమావేశాలు ముగిశాయి.. పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.. ప్లీనరీ వేదికపై దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్ నివాళులర్పించారు. ప్లీనరీ సమావేశాలకు వైఎస్ విజయమ్మ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు.. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు హాజరు కావడంతో పండగలా వైఎస్సార్సీపీ ప్లీనరీ…
మంత్రి ఆర్కే రోజా సొంత నియోజకవర్గం నగరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ వైపు దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు బ్యానర్లు, ఫ్లెక్సీలు కడితే.. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తోన్న బాదుడే బాదుడు కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టాయి టీడీపీ శ్రేణులు.. దీంతో.. నగరి టౌన్లో ఎటు చూసినా వైసీపీ వర్సెస్ టీడీపీ…