Kodali Nani: టీడీపీ నేతలకు సవాల్.. గుడివాడలో క్యాసినో ఆడించినట్లు ఆధారాలుంటే అరెస్ట్ చేయించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani: టీడీపీ నేతలకు గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. గుడివాడలో తాను క్యాసినో నిర్వహించినట్టు ఆధారాలు ఉంటే ఈడీకి చూపించి తనను అరెస్ట్ చేయించాలన్నారు. టీడీపీ నేతలకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ఈ పని చేయాలని డిమాండ్ చేశారు. చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారాన్ని తనపైనా, సీఎం జగన్‌పైనా రుద్దేందుకు టీడీపీ నేతలు తెగ ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏం జరిగినా చంద్రబాబు భజన బృందం తమకు ముడిపెడుతోందని మండిపడ్డారు. బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. పలావు ప్యాకెట్లకు ఆశపడే వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి పిచ్చికుక్కల మాదిరి మొరుగుతున్నారటూ ఆరోపించారు. గుడివాడలో క్యాసినో అంటూ వచ్చిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఆ నివేదికలను ఈడీకి అందించాలని, ఎన్ని వందల కోట్లు చేతులు మారాయో ఆధారాలు ఇవ్వాలని కొడాలి నాని ఛాలెంజ్ చేశారు.
Read Also: Rashtrapatni Row: కాంగ్రెస్ ఎంపీకి మహిళా కమిషన్ నోటీసులు..
Also Read
కాగా విదేశాల్లో క్యాసినో వ్యవహారం బయటపడిన నేపథ్యంలో దీనికి సూత్రధారిగా భావిస్తున్న చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడిచేసి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో బడాబాబులు జూదం ఆడేందుకు విదేశీ పర్యటనలు ఏర్పాటు చేయడమే కాకుండా, హవాలా, మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధుల పాత్ర ఉందన్న ఊహాగానాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో ఏర్పాటు చేసినట్లు గతంలో వార్తలు రావడంతో ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కొడాలి నాని పాత్రపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం నాడు గుడివాడలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన కొడాలి నాని చికోటి ప్రవీణ్ వ్యవహారంపై స్పందించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!