జాతీయ స్థాయిలో విపక్షాలు కేంద్రంపై పోరాడుతూనే ఉన్నాయి.. కానీ, కొన్ని ప్రతిపక్షాలకు.. బీజేపీకి పెద్దగా తేడా లేదన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు..
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాదరణ కోల్పోయ్యారంటు చంద్రబాబు చెప్పడం చూస్తూంటే ఆయనకి చిన్న మెడదు చితికిందా..? అనే అనుమానం కలుగుతోందన్నారు మంత్రి ఆర్కే రోజా
కేంద్ర ప్రభుత్వ పనితీరుతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాలనపై దేశంలో ప్రముఖ సర్వే సంస్థ సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ సర్వే (సీఎన్ఓఎస్) భారీ సర్వే నిర్వహించింది. ప్రభుత్వ విధానాలు, పాలకుల పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయం సేకరించింది. సీఎన్వోఎస్ తాజా సర్వే ఫలితాల్లో ప్రధాని మోదీకి గతంలో కంటే ప్రజాదరణ కాస్త పెరిగింది. మోదీ నికర ఆమోదం రేటింగ్ 36 పాయింట్లుగా ఉంది. 54 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆమోదించారు. 18…
రైతులకు ద్రోహం చేశారు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. అమరావతిలో సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన… చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు కాటకాలు విలయతాండవం చేస్తుంటాయి.. గత ప్రభుత్వ హయాంలో 471 మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుని పోయి ఆత్మహత్య చేసుకున్న విషయం వాస్తవమా కాదా?? వీరందరికీ మా ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించిన విషయం వాస్తవమా కాదా? అని నిలదీశారు.. దీనిపై దత్త పుత్రుడు…
అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సెక్యూరిటీని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పయ్యావులకు ప్రస్తుతం ఉన్న 1+1 భద్రతను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పయ్యావుల గన్ మెన్లను వెనక్కు రావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. తనకు 2+2 కేటాయించాలంటూ ఇటీవల అధికారులను పయ్యావుల కోరగా ఇప్పుడు ఉన్న భద్రతనే తొలగించడం హాట్ టాపిక్గా మారింది. పెగాసస్పై పయ్యావుల కేశవ్ మీడియా సమావేశం నిర్వహించిన తరువాతనే ప్రభుత్వం భద్రత తొలగించిందంటూ టీటీపీ…
ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్సీపీకి శాశ్వత అధ్యక్షుడిగా సీఎం వైఎస్ జగన్ని నియమించటం చట్టవిరుద్ధమని సీపీఐ నారాయణ అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్-29ఏ ప్రకారం ఈ తీర్మానం చెల్లదని చెప్పారు. ఈ మేరకు ఆయన నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న ఏ రాజకీయ పార్టీలో అయినా అంతర్గ ప్రజాస్వామ్యం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓట్ల ప్రక్రియ ద్వారానే అధ్యక్షుడు సహా మొత్తం కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని తెలిపారు. నిబంధనలు కూడా…
విజయవాడలో మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జనసేన ఆధ్వర్యంలో జనవాణి రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టగా స్థానికుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని జనవాణి కార్యక్రమం ద్వారా తాము చేస్తున్నామని తెలిపారు. వైసీపీ సర్కారు తన బాధ్యతలను మర్చిపోయిందని.. దీంతో సామాన్యులు, మధ్యతరగతి వాళ్లు నేడు నలిగిపోతున్నారని పవన్ ఆరోపించారు. తాను సంపూర్ణంగా ప్రజల పక్షాన నిలబడేందుకు వచ్చానని భరోసా ఇచ్చారు.…
ప్రకాశం జిల్లా పర్యటనలో మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీని, వైఎస్ఆర్ కుటుంబాన్ని వేర్వేరుగా చూడలేమని తెలిపారు. విజయమ్మ గౌరవ అధ్యక్షురాలి పదవికి ఎందుకు రాజీనామా చేస్తున్నారో వివరించారని.. అయినా ఈ విషయంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వైఎస్ఆర్సీపీ అనేది జగన్ కష్టంతో ఎదిగిన పార్టీ అని అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్లీనరీకి వచ్చిన జనాన్ని చూసి ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిందని.. దీంతో పిచ్చిపిచ్చికూతలు కూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రాన్ని ఒక వర్గానికి ధారాదత్తం చేశారని ఆరోపించారు.…