Botsa Satyanarayana: ఏపీలో మూడు రాజధానుల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజుకుంటోంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు వైసీపీ వికేంద్రీకరణ రాగం అందుకుందని టీడీపీ ఆరోపిస్తుంటే.. వికేంద్రీకరణ చేస్తే టీడీపీకి వచ్చిన నష్టమేంటని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖ గర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 15న ఉదయం 9 గంటల నుంచి విశాఖ…
VishnuVardhan Reddy: రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా ఓ డ్రామా అని బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ అనుమతిస్తే రాజీనామా చేస్తామని ఇతర ఎమ్మెల్యేలు కూడా డ్రామా ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయకపోవడం అందులో చిత్తశుద్ధి లేకపోవడమేనన్నారు. రాజీనామా ఆమోదించాలని రాజీనామా చేయడం లేదని.. చిత్తశుద్ధి ఉంటే ఏపీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు…
Adimulapu Suresh: రాజధాని వికేంద్రీకరణపై మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం అంటూ పాదయాత్ర చేస్తున్న వాళ్లు రైతుల్లా కనిపించటం లేదని ఆరోపించారు. ఓ అజెండా ప్రకారం చంద్రబాబు చెప్పినట్లుగా వారు చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు ఓ దురుద్దేశంతో చేయిస్తున్న పాదయాత్రలా కనిపిస్తోందని.. కొంతమంది పెట్టుబడిదారులు వెనుక ఉండి నడిపిస్తున్నారని విమర్శలు చేశారు. వికేంద్రీకరణ అనేది ప్రజల ఆకాంక్ష అని.. రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్…
Karanam Dharmasri: ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రను వైసీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా విశాఖ రాజధానికి మద్దతుగా జేఏసీని ఏర్పాటు చేశారు. విశాఖ రాజధానికి అనుకూలంగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టు భర్తీ అంశం తెరపైకి వచ్చింది. 1998లో డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులను మినిమమ్ టైం స్కేల్పై…
Roja Selvamani: తెలుగుదేశం పార్టీపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా మరోసారి తనదైన శైలిలో ఫైరయ్యారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ దుశ్శాసనుల పార్టీగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ నేతలే అత్యాచారాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని మంత్రి రోజా ఆరోపించారు. యువతులు, మహిళలపై టీడీపీ నేతలు చేసే అరాచకాలపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేత వేధింపుల వల్లే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుందని మంత్రి రోజా ఆగ్రహం…
విశాఖను రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పదవికి కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసిన ఆయన.. ఆ లేఖను జేఏసీ ప్రతినిధులకు అందజేశారు.
Jogi Ramesh: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ఆవిర్భావం కోసం జన్మించిన టీఆర్ఎస్ పార్టీ తన పేరును మార్చుకుంది. ఇకపై భారత్ రాష్ట్ర సమితిగా రాజకీయాల్లో ముందడుగు వేయనుంది. జాతీయ రాజకీయాల దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీ తన పేరును మార్చుకుంది. అయితే బీఆర్ఎస్పై మంత్రి జోగి రమేష్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ ప్రభావం ఏమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో చాలా మంది పార్టీలు పెట్టుకుంటూ ఉంటారని.. వాళ్ళు ఆలోచనలను…
Somu Veerraju: విశాఖలోని దసపల్లా భూముల అన్యాక్రంతంపై సీఎం జగన్కు మంగళవారం నాడు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు లేఖ రాశారు. విశాఖ నగరంలో అన్యాక్రాంతమవుతున్న దసపల్లా భూములను కాపాడి స్వాధీనం చేసుకోవాలని లేఖలో కోరారు. విశాఖపట్నం నగర నడిబొడ్డున ప్రభుత్వ అతిథి గృహాన్ని ఆనుకుని ఉన్న వివాదాస్పద దసపల్లా భూములను కొందరు బిల్డర్లకు అప్పగించటానికి రంగం సిద్ధమైందని.. దీని వెనుక అధికార పార్టీ నాయకులకు, వారి బంధువర్గాలకు ప్రయోజనం చేకూరేలా కోట్లాది రూపాయల కుంభకోణం…