విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి… జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్ట్ దగ్గరకు పెద్ద సంఖ్యలో చేరుకున్నాయి జనసేన శ్రేణులు.. ఇదే సమయంలో.. విశాఖ గర్జనకు వచ్చిన మంత్రులు.. ఎయిర్‌పోర్ట్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు.. ఈ సమయంలో.. మంత్రుల కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడినట్టుగా చెబుతున్నారు.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ నేతల కార్లపై రాళ్లు రువ్వారు జనసైనికులు.. మంత్రి జోగి రమేష్, వైవీ సుబ్బారెడ్డి కార్లపై కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు.. అయితే, ఈ దాడిని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించారు.. దీంతో.. జనసేన-వైసీపీ శ్రేణుల మధ్య దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది..
Read Also: Somu Veerraju: విశాఖ గర్జన ప్రభుత్వ సభ.. వీరికి దశ, దిశ లేదు..!
అయితే, ఈ దాడి జరిగిన సమయంలో మంత్రి జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒకే కారులో ఉన్నట్టుగా చెబుతున్నారు.. ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో జనసేన కార్యకర్తలు దాడి చేయడంతో.. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది… ఇక, జనసేన దాడిని తీవ్రంగా ఖండించారు మంత్రి జోగి రమేష్.. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించిన ఆయన.. జనసేన కార్యకర్తల దాడిలో మా వాళ్లకు దెబ్బలు తగిలాయన్నారు.. పక్కజిల్లాల నుంచి చిల్లరగాళ్లను తీసుకొచ్చి.. విశాఖలో చిల్లర వేశాలు వేశారని మండిపడ్డారు.. వైసీపీ కూడా ఇలా దాడి చేయాలనుకుంటే.. పవన్ కల్యాణ్ ఎక్కడైనా తిరగగలాడా? అని ప్రశ్నించారు జోగి రమేష్..