సినీనటుడు, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణ మురళికి గుడ్‌న్యూస్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పోసానిని నియమించారు… ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఇటీవలే ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారుగా సినీనటుడు అలీని నియమించిన విషయం తెలిసిందే కాగా… ఇప్పుడు పోసానికి కీలక పోస్టు కట్టబెట్టారు వైసీపీ అధినేత జగన్..
Read Also: Dhostan: స్నేహం నేపథ్యంలో రాబోతున్న ‘దోస్తాన్’
అయితే, పోసాని కృష్ణ మురళితో పాటు.. అలీ మరికొందరు సినీ నటులు గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కీలకంగా పనిచేశారు.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొందరికి పదవులు వచ్చినా.. పోసాని, అలీ లాంటివారి విషయంలో కొంత ఆలస్యమే జరిగింది… పలు సందర్భాల్లో పోసాని కృష్ణమురళి దీనిపై బహిరంగంగానే స్పందించారు.. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ఎప్పుడు ఏం చేయాలో తెలుసని.. తాను పదవులను ఆశించడం లేదు.. కానీ, ఇస్తే సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి.. ఇదే సమయంలో కంటే జూనియర్లకు పదవులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు కూడా.. అయితే, మొత్తంగా.. కాస్త గ్యాప్ తర్వాత అయినా కీలక పోస్టు పోసాని కృష్ణమురళిని వరించింది.