భద్రాద్రి రాముడు ఆస్తులను మాఫియా ముఠా నుంచి కాపాడాలంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. భద్రాద్రి రాముడికి చెందిన భూములు రాష్ట్ర విభజన సందర్భంగా మన రాష్ట్రానికి బదిలీ అయిన 7 మండలాల ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో పరిధిలోకి వచ్చాయి.. జిల్లాల విభజనలో అవి శ్రీ అల్లూరి మన్యం జిల్లా, పాడేరు పరిధిలోకి వచ్చాయని.. ఈ భూములపై కన్నేసిన ఒక ముఠాలోని కొందరు, భాగాలుగా ఏర్పడి మాఫియాగా…
తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దని చెప్పారని గుర్తుచేసుకున్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు… శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన… జిల్లా ప్రజలందరి మనసులో విశాఖపట్నం రాజధాని అంశం ఉందన్నారు.. ప్రతి ఒక్కరూ గొంతు విప్పి మాటాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చిన ఆయన.. విశాఖ రాజధాని అంశంలో రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు.. మంత్రి పదవికి తాను రిజైన్ చేస్తానంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్…
Dharmana Prasad Rao: వికేంద్రీకరణ అంశంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక కామెంట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో సామాన్యులకు స్థానం ఉండదని ఆరోపించారు. క్యాపిటల్ అంటే యాక్సప్టబులిటీ ఉండాలని.. రవాణా సౌకర్యం ఉండి తీరాలని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ధనవంతుల జాబితా తీస్తే 100 మందిలో 99 మంది ఇతర ప్రాంతాల వారే ఉంటారన్నారు. ఉత్తరాంధ్రకు రాజ్యాంగబద్ధంగా ఆస్తులు, సంపదలు చేజారాయన్నారు. దేశంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా క్యాపిటల్ చుట్టూ మాత్రమే జరిగిందని…
Dharmana Krishna Das: శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట వైసీపీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సారవకోట మండలం చీడిపూడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా జగన్ మరోసారి సీఎం అవుతారంటూ జోస్యం చెప్పారు. అలా జరగని పక్షంలో తాను ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తానని ధర్మాన కృష్ణదాస్ ప్రకటించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరితో…
Andhra Pradesh: ఇటీవల విశాఖలో మంత్రులపై దాడి ఘటన ఏపీలో పెనుదుమారం రేపింది. అయితే తాజాగా తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలలోని మంత్రులు, పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని అధికార పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. అర్జీలు ఇచ్చే సాకుతో జనసేన కార్యకర్తలు దాడులు చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ విభాగం వార్నింగ్ ఇచ్చింది. టెక్కలిలో జనసేన కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి అలర్ట్ కావాలంటూ ఇంటెలిజెన్స్…
Minister Roja: వైసీపీలో ఫైర్బ్రాండ్లు ఎవరంటే అందరూ టక్కున మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని పేర్లు చెప్తారు. వీళ్లిద్దరూ ప్రెస్‌మీట్‌కు వచ్చి మాట్లాడితే ప్రతిపక్షాలకు పంచ్‌లు పడాల్సిందే. ఈ నేపథ్యంలో శనివారం నాడు మాజీ మంత్రి కొడాలి నాని పుట్టినరోజు కావడంతో మంత్రి రోజా స్పెషల్‌గా విషెస్ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే కొడాలి నాని అన్నయ్యా’ అంటూ సోషల్ మీడియాలో మంత్రి రోజా పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ‘నీ అంత…
Pawan Kalyan: విశాఖలో మంత్రుల కార్లపై దాడి కేసులో జైలు నుంచి 9 మంది జనసేన నాయకులు విడుదల కావడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. విశాఖపట్నంలో పాలకపక్షం బనాయించిన అక్రమ కేసుల వల్ల జైలుపాలైన తొమ్మిది మంది నేతలు ఈరోజు బెయిల్ మీద బయటకు రావడం సంతోషించదగ్గ పరిణామం అని పవన్ పేర్కొన్నారు. జనసేన నేతలు జైలులో ఉన్న సమయంలో వారి కుటుంబ సభ్యులు ఎంత ఆందోళనకు గురయ్యారో తనకు తెలుసన్నారు. జైలులో ఉన్న…
ఏపీ విషయంలో బీజేపీకి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్… రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతం అయ్యిందన్నారు.. ఇక, స్పెషల్ స్టేటస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.. రాహుల్ యాత్రతో ప్రజలల్లో మార్పు కనిపిస్తోంది. ప్రజలలో నమ్మకం, ఆదరణ పెరుగుతోందన్న ఆయన.. బీజేపీకి మాట్లాడే అర్హతేలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. దేశం,…