జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లినా గుర్తు తెలియని వ్యక్తులు, కారు, బైక్‌లపై అనుసరించడం.. ఆయన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించడం.. చివరకు హైదరాబాద్‌లోని ఆయన నివాసం దగ్గర సెక్యూరిటీతో గొడవకు దిగడం సంచలంగా మారిపోయింది… గత రెండు, మూడు రోజుల నుంచి పవన్‌ని వెంబడిస్తోన్న ఆగంతకులు.. పవన్ ఇంటి వద్దర కారు ఆపి సెక్యూరిటీతో గొడవకు దిగారని, సెక్యూరిటీని రెచ్చగొట్టేలా ప్రవర్తించారని.. కానీ, సెక్యూరిటీ రెచ్చిపోకుండా.. వారిని వీడియో తీసినట్టు జనసేన నేతలు చెబుతున్నారు.. ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే, కలకలం సృష్టించిన ఈ రెక్కీపై విపక్షాలు కండిస్తున్నాయి.. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పవన్ కల్యాణ్ ఇంటి వద్జ రెక్కీ చేస్తారా..? పవన్‌పై దాడులు చేద్దామనుకుంటారా..? ఎవరిని బతకనివ్వరా..? అందర్నీ చంపేస్తారా..? అంటూ ఘాటుగా స్పందించారు.
Read Also: Munugode Bypoll : మధ్యాహ్నం 3గంటల వరకు 59.92 శాతం పోలింగ్
ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారి గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించిన చంద్రబాబు.. బీసీ నేత అయ్యన్న ఇంటికి తెల్లవారుజామున గోడ దూకి పోలీసులు వెళ్లారు. అయ్యన్న హత్య చేశారా..? హత్యా రాజకీయాలు చేశారా..? పోలీసులు గోడలు దూకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది..? అని నిలదీశారు.. పేదలకు భూములిచ్చిన చరిత్ర అయ్యన్నది అని గుర్తుచేసిన ఆయన.. అయ్యన్న కుటుంబం ఇచ్చిన భూముల్లో ఇళ్లు కట్టుకుని అయ్యన్నపాలెం అని పేరు పెట్టుకున్నారని తెలిపారు.. ఏ తప్పు లేకున్నా.. 70 ఏళ్ల వయసు.. 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో ఉన్న అయ్యన్నను ఏ-1 అంటారా..? అని మండిపడ్డారు. శారీరకంగా హింసిస్తారేమో.. మానసికంగా మేం బలంగా ఉన్నాం అన్నారు.. సీఐడీ ఆఫీస్ టార్చర్ ఆఫీసుగా మారిందని ఆరోపించిన ఆయన.. నలుగురు మాజీ మంత్రులను అక్రమంగా అరెస్ట్ చేయిస్తారా..? అయ్యన్నపై రేప్ కేసు పెడతారా..? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మీ పాపాలే.. శాపాలుగా మారతాయి.. తప్పుడు పనులు చేస్తున్న అధికారులపై కచ్చితంగా చర్యలుంటాయని… ఇదంతా రికార్డుల్లో ఉంటుంది.. గుర్తు పెట్టుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.