తన రాజకీయ జీవితం జగన్ పెట్టిన భిక్ష అని నరసరావు పేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. తాను రాజకీయాలకు వచ్చేటప్పటికి ఒంటరినని తెలిపారు. కోటప్పకొండ శివుడు సాక్షిగా చెబుతున్నా.. నాకు ఎవరూ లేకపోయినా తండ్రి లాగా, సాక్షాత్తు దైవంలాగా సీఎం జగన్ నన్ను ఆదరించారని ఆయన వెల్లడించారు.
ఏపీలోని ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చెల్లెమ్మ, వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడిని కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఏరిగేరి గ్రామంలో ప్రజలకు అండగా ఉంటాం.. నేను కచ్చితంగా ఎమ్మెల్యే అవుతాను.. మీకు పక్కా ఇళ్లు కట్టిస్తాం అని హామీ ఇచ్చారు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి.. కౌతాళం మండలం ఏరిగేరి గ్రామంలో జరిగిన బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రాలయంలో మూడుసార్లు గెలిచాను అని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి.. మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడని దుయ్యబట్టారు.
నేను చంద్రబాబును కలిశానని.. పార్టీ మారుతానని కొందరు ఏడాది నుంచి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి .. ప్రతిసారి నేను క్లారిటీ ఇస్తున్నాను.. నేను పార్టీ మారే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు.. ఈ సారి కూడా వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. నెల్లూరు రూరల్ నుంచి అసెంబ్లీకి లేదా నెల్లూరు లోక్సభ కా అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు..