మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి ఆర్కేను ఆహ్వానించారు. అయితే, గత డిసెంబర్‌లో వ్యక్తిగత కారణాలతో వైసీపీకి, మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. అయితే, అదే సమయంలో ఆయన రాజీనామాపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. ఈలోపు ఆర్కే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.. అయితే నెల తిరగక ముందే, తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.
Read Also: Tribal Welfare Officer: ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతికి అస్వస్థత.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స
ఇక, వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు చేరుకున్న మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి.. సీఎం జగన్‌ను కలిసి పార్టీలో చేరారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా.. మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జీగా గంజి చిరంజీవిని వైసీపీ అధిష్టానం నియమించింది. ఈ తరుణంలో నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలను ఆర్కేకు అప్పగించినట్లు సమాచారం.