నేను చంద్రబాబును కలిశానని.. పార్టీ మారుతానని కొందరు ఏడాది నుంచి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి .. ప్రతిసారి నేను క్లారిటీ ఇస్తున్నాను.. నేను పార్టీ మారే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు.. ఈ సారి కూడా వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. నెల్లూరు రూరల్ నుంచి అసెంబ్లీకి లేదా నెల్లూరు లోక్సభ కా అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు..
ఫేక్లే పార్టీ మారతారు.. నిజంగా వైఎస్ జగన్ను అభిమానించేవారు పార్టీ మారరు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్సీ అనిల్ కుమార్ యాదవ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను చనిపోయిన తర్వాత తన శవంపై పార్టీ జెండా జగన్ కప్పాలని బహిరంగంగా చెప్పిన నేత పార్టీ మారారు.. అందుకే ఎవరిని నమ్మాలన్నా భయం వేస్తుందన్నారు.. జగన్ బాగా నమ్మినవారిలో కొందరు ఆయననే మోసం చేశారని దుయ్యబట్టారు..