Alla Ramakrishna Reddy Back To YSRCP: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్నారు.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో మళ్లీ పార్టీలోకి వచ్చేశారు.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే.. మంగళగిరిలో పార్టీని మూడవ సారి గెలిపించేందుకు వైసీపీలో చేరినట్టు వెల్లడించారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాటలో నడిచేందుకు వచ్చాను.. వైఎస్ జగన్ సీఎంగా ఉంటే ప్రజల జీవితాలు బాగు పడతాయన్నారు.. మంగళగిరిలో పార్టీ ఏ అభ్యర్థిని నిలబెట్టినా.. వాళ్ల గెలుపు కోసం కృషి చేస్తాను అని వైఎస్ జగన్‌కు చెప్పానని.. భేషరుతుగా వైసీపీలో చేరానని ప్రకటించారు.
Read Also: Chari 111: ఆపరేషన్ రుద్రనేత్ర… ‘చారి 111’ థీమ్ సాంగ్ విడుదల…
ఇక, బీసీ సామాజిక వర్గ అభ్యర్థి చేతిలో మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోతారు అని జోస్యం చెప్పారు ఆర్కే.. మంగళగిరి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్న ఆయన.. బీసీ సామాజికవర్గానికి వైసీపీ మంగళగిరి టికెట్ ఇస్తుందని క్లారిటీ ఇచ్చారు.. మరోవైపు వైఎస్ జగన్‌ను ఓడించడానికి రాష్ట్రంలో పార్టీలు అన్ని ఒక్కటి అయ్యాయని ఫైర్ అయ్యారు.. మొత్తంగా మూడోసారి మంగళగిరిలో వైసీపీ గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి.. కాగా, వైసీపీ టికెట్ రాదనే సంకేతాలతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆర్కే.. ఆ తర్వాత వైఎస్ షర్మిలతో కలిసి నడవనున్నట్టు ప్రకటించారు.. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు.. అయితే, కొన్ని రోజుల్లోనే తిరిగి ఆయన సొంత గూటికి చేరుకోవడం ఆసక్తికరంగా మారింది.. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆర్కే ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..