ఫేక్‌లే పార్టీ మారతారు.. నిజంగా వైఎస్ జగన్‌ను అభిమానించేవారు పార్టీ మారరు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్సీ అనిల్ కుమార్ యాదవ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను చనిపోయిన తర్వాత తన శవంపై పార్టీ జెండా జగన్ కప్పాలని బహిరంగంగా చెప్పిన నేత పార్టీ మారారు.. అందుకే ఎవరిని నమ్మాలన్నా భయం వేస్తుందన్నారు.. జగన్ బాగా నమ్మినవారిలో కొందరు ఆయననే మోసం చేశారని దుయ్యబట్టారు..
వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశాల మేరకు వివిధ రీజనల్ కో-ఆర్డినేటర్లకు పార్లమెంట్ నియోజకవర్గాలు, జిల్లాల బాధ్యతలను వైసీపీ అధిష్ఠానం అప్పగించింది. ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించగా.. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణును నియమించారు.
Amit Shah: పొత్తుల గురించి కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త మిత్రపక్షాలను ఎప్పుడూ స్వాగతిస్తామని, పాత మిత్రుడైన శిరోమణి అకాళీదళ్‌తో చర్చలు జరుగుతున్నాయని ఆయన శనివారం అన్నారు. రాజకీయాల్లో ‘‘ఫ్యామిలీ ప్లానింగ్’’ ఉండని చెప్పారు. జయంత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీ లోక్‌దళ్(ఆర్ఎల్డీ), శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ), ఇతర ప్రాంతీయ పార్టీలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)లో చేరే అవకాశం గురించి అడిగిన సందర్భంలో అమిత్ షా ఈ విధంగా వ్యాఖ్యానించారు.
ఏపీలో టీడీపీతో పొత్తుపై త్వరలో క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ వైపు సీఎం జగన్, మరోవైపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన చర్చించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో పొత్తుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఏపీలో పొత్తులపై కొన్ని రోజుల్లోనే నిర్ణయం ఉంటుందని అమిత్ షా అన్నారు.