ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ వైసీపీ చేపట్టిన ఇంఛార్జ్ ల మార్పుల్లో టికెట్ కోల్పోయిన సీనియర్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత పార్టీలోకి వచ్చేందుకు చూస్తున్నారు.
అయితే, ఆయన వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో సీటు కోల్పోయారు. దీంతో అధికార పార్టీకి గుడ్ బై చెప్పి ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల హాయంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అంతే కాదు కాంగ్రెస్ లో చేరిన తొలి వైసీపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.
Read Also: Local Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. మూడు రోజుల పాటు లోకల్ హాలీడేస్..
అయితే, ఇంత వరకూ అంతా బాగానే ఉంది.. కానీ, కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డికి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకూ మంగళగిరి ఎమ్మెల్యేగా, అధికార పార్టీ నేతగా ఉన్న పలుకుబడి అంతా పోవడంతో పాటు సొంత నియోజకవర్గంలో ప్రోటోకాల్ దగ్గరి నుంచి అన్నీ వదిలి పెట్టాల్సిన పరిస్థితి ఆళ్లకు ఎదురైంది. దీంతో ఆయనతో పాటు ఉండి గెలిపించిన అనుచరులంతా ఆత్మరక్షణలో పడ్డారు. అంతే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఒత్తిడి పెంచారు. దీంతో గత రెండు రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో చర్చించారు. ఈ చర్చల్లో తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు ఆళ్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక, ఇవాళ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్ ను ఆళ్ల రామకృష్ణారెడ్డి కలవనున్నారు.
Read Also: Uttarpradesh : ‘యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ కారణంగా మారుతున్న యూపీ ఆర్థిక వ్యవస్థ
ఇక, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీలో చేరే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే ఆర్కే స్ధానంలో వైసీపీ ఎంపిక చేసిన బీసీ అభ్యర్ధి గంజి చిరంజీవికి నియోజకవర్గంలో అంతగా ఆదరణ లేకపోవడంతో తిరిగి మంగళగిరి ఇంఛార్జ్ ను కూడా మార్చే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో ఆర్కే కూడా వైసీపీలోకి తిరిగి వస్తే జగన్ రిస్క్ ఎందుకని తిరిగి ఆయనకే టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు అని వైసీపీలో అనుకుంటున్నారు.