ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, వైఎస్ జగన్ నా సవాల్ తీసుకుంటారా? అని ప్రశ్నించారు.. జగన్ కి నేనొక అవకాశం ఇస్తున్నా.. నాతో కలవమనండి..! అని సూచించారు. ఇక, జగన్, చంద్రబాబుని సిద్ధమా అంటున్నాడు.. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చంద్రబాబు, జగన్ కి నా సవాల్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కి…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలనాపై రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు ఏర్పాటు చేశారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.వి కృషంరాజు ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ లీలా గ్రాండ్ హోటల్ లో ఈ సదస్సు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి తెలుగు అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ లక్ష్మీపార్వతితో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
నేడు అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. రాప్తాడులో జరిగే 'సిద్ధం' బహిరంగ సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి తన నివాసం నుంచి బయల్దేరి ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైసీపీ శ్రేణులు భారీగా తరలిరానున్నారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.