Minister Dharmana Prasada Rao: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేసి సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారు.. రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అని ఆరోపించారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా తయారు చేశారన్న ఆయన.. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూపిన ఘనత జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఎన్నికల ముందు మాట ఇచ్చిన మేరకు మేనిఫెస్టోలో పేర్గొన్న అంశాలన్నీ ఆచరణలో అమలు చేసిన ఏకైక నేత జగన్ మాత్రమే అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు సరికొత్త నాటకాలు ఆడుతున్నారు. ప్రజలు నమ్మరని అధికారం కోసం అడ్డదారులు తొక్కడం టీడీపీకి అలవాటు అని మండిపడ్డారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుతో చర్చకు రెడీ.. సీఎం అవసరంలేదు.. మా నేతలు చాలు..!
చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేశాడు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రజలు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకి కనిపించలేదా..? అని ప్రశ్నించారు ధర్మాన. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఉద్దాన ప్రాంతాన్ని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రజలకు ధైర్యం చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. చంద్రబాబు గత నాలుగేళ్లు డబ్బు పని చేస్తున్నారని చెప్పి.. ఇప్పుడు వాటికంటే ఎక్కువ ఇస్తానని అబద్ధపు మాటలు చెబుతున్నారంటూ ఫైర్ అయ్యారు మంత్రి ధఱ్మాన ప్రసాదరావు.