తాడేపల్లిగూడెం టీడీపీ - జనసేన మీటింగ్పై మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ పూజకు పనికి రాని పువ్వు అని ఆయన వ్యాఖ్యానించారు. 24 సీట్లు తీసుకున్న పవన్ నిర్ణయంతో జన సైనికులు ఎంత బాధతో ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుందన్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు, పార్లమెంటరీ స్థానాలకు ఇన్ఛార్జ్లను మారుస్తోంది అధికార వైఎస్సార్సీపీ. తాజాగా ఐదుగురు సభ్యులతో కూడిన ఎనిమిదో జాబితాను విడుదల చేసింది.
వైసీపీలో కింద స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద లీడర్ల వరకూ అందరినీ గౌరవంగా చూసుకుంటామని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీలో ఆత్మగౌరవ సమస్య అనేది రాదు.. అలా ఏ చర్యలు ఉండవన్నారు.
ఎన్నికల వేళ.. ఏపీలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. వైసీపీలో అసంతృప్తులంతా ఎవరి దారి వారు చూసుకుంటుంటే.. టికెట్ల ప్రకటన తర్వాత టీడీపీ, జనసేనలో మొదలైన లుకలుకలను ఆయుధంగా మార్చుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వంగవీటి రాధాను మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ.
పలనాడు జిల్లాలోని మాచర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరొకసారి వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాచర్లలోని 28వ వార్డులో పార్టీ కార్యక్రమానికి సంబంధించి ఫ్లెక్సీలు కడుతున్నారు టీడీపీ నాయకులు.
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులతో సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై 2500 మందితో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. వచ్చే 45 రోజులు…