Vasantha Krishna Prasad: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావుపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. రెండున్నర దశాబ్దాలు టీడీపీలో పనిచేసిన ఉమ.. కొద్ది రోజుల తర్వాతైనా పార్టీ లైన్ లోకి వస్తారని భావిస్తున్నాను.. ఉమ పార్టీ కార్యక్రమాలు చేస్తే స్వాగతిస్తాం అన్నారు. అయితే, నా టార్గెట్ గా ఉమ పని చేస్తే తగిన సమయంలో సమాధానం చెబుతాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఉమ వ్యవహారాలు అన్నీ అధిష్టానం దృష్టిలో ఉన్నాయన్నారు. ఉమ, బొమ్మసాని కలిసి పనిచేయటం ఎందుకు ?.. నేను కూడా కలిసి ముగ్గురం ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ కోసం పని చేస్తాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమకు టికెట్ ఇచ్చినా నేను, నా వర్గం పని చేయటానికి సిద్ధం అని ప్రకటించారు వసంత..
Read Also: Pakistan Boxer: విదేశాల్లో తోటి క్రీడాకారిణి డబ్బు దొంగిలించి.. పరారైన పాకిస్తాన్ బాక్సర్!
అయితే, ఉమ వద్దని చెప్పినా చంద్రబాబు చెబితే చేస్తాం అన్నారు కృష్ణప్రసాద్.. నేను పార్టీలో పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్తున్నాను.. ఎవరు ఏం చేసినా చివరికి టీడీపీ గూటికే చేరుకోవాల్సిందే అన్నారు. ఇక, బొమ్మసాని సుబ్బారావు.. నా అన్న, ఆయన్ని ఇవాళ కలిశాను అని తెలిపారు. అంతేకాదు.. నన్ను పక్క నియోజకవర్గం వెళ్లమని పార్టీ చెబితే సిద్ధం అని ప్రకటించారు. విమర్శలపై స్పందిస్తూ.. టీడీపీ శ్రేణులపై ఉద్దేశపూర్వకంగా కేసులు నేను ఎప్పుడు పెట్టించలేదని స్పష్టం చేశారు.. పార్టీ, ప్రభుత్వం నుంచి వచ్చిన లిస్ట్ ప్రకారం కేసులు పెట్టారని తెలిపారు.. నేనేం తప్పు చేయలేదు.. నాకు ఏ కేసులు పెట్టినా భయం లేదు, చట్టపరంగా ఎదుర్కొంటాను అంటూ ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..