Devineni Avinash: చిరంజీవి, పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్.. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేసిన వ్యాఖ్యలు కౌంటర్ ఇస్తూ.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. నేను చూసిన చేతకాని ఎమ్మెల్యే గద్దె అంటూ ఫైర్ అయ్యారు.. గద్దె ఎంత అసమర్థుడో ఎంపీ కేశినేని నాని చెప్పారు. గద్దె కాల్ మనీ, సెక్స్ రాకెట్, పేకాట, బెట్టింగ్ ల చరిత్ర మాకు తెలుసన్నారు..
Read Also: PM Modi: తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు కేంద్రం సహకరిస్తోంది: ప్రధాని మోడీ
ఇక, చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు దేవినేని అవినాష్.. గతంలో చిరంజీవి రాజకీయ జీవితాన్ని చంద్రబాబు నాశనం చేశాడని పేర్కొన్న ఆయన.. ఇప్పుడు పవన్ కల్యాణ్ రాజకీయ జీవితం నాశనం చేయటానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు.. పవన్ కల్యాణ్ అభిమానులే ఈ మాట చెబుతున్నారని తెలిపారు.. బెజవాడ తూర్పు నియోజకవర్గంలో జనసేన నేతలను తెలుగుదేశం పార్టీ నేతలు ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. వ్యక్తిగత విమర్శలు మాని.. చేసిన అభివృద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. మేం పుట్టక ముందు జరిగిన విషయాలు, చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడటం దిగజారుడుతనం అవుతుందని హితవుపలికారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్.