Nagari: ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజాపై మరోసారి ఫైర్ అయ్యారు నగరి నియోజకవర్గానికి చెంది ఐదు మండలాల వ్యతిరేక వర్గం నేతలు.. రోజా, అమె అన్నల దోపిడీకి అడ్డుగా ఉన్నామని మమ్మల్ని దూరం పెట్టి వేధించిందన్నారు వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, లక్ష్మీపతిరాజు, పుత్తూరు నేత అమ్ములు, సహా ఇతర మండలాల నేతలు.. మా వ్యతిరేకవర్గం నేతలు ఎవరైనా సరే అవినీతి పాల్పడి ఉంటే దానిపై రోజాతో చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. గత ఎన్నికల వరకు అప్పుల్లో కూరుకుపోయి రోజా.. ఇప్పుడు మంత్రి అయ్యాక ఎంత సంపాదించిందో అందరికీ తెలుసన్నారు. ఐరన్ లెగ్ గా పేరున్న రోజాను మేం గోల్డెన్ లెగ్ గా మార్చామని.. అలాంటిది ఇప్పుడు పుత్తూరు, నగరిలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతూన్నాయాని సంచలన ఆరోపణలు చేశారు. రోజా కాకుండా సీటును మాలో ఎవరికైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా మళ్లీ మంత్రి ఆర్కే రోజాకే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీటు ఇస్తే మేం పనిచేయామని స్పష్టం చేశారు.
Read Also: Dasoju Sravan: మోడీ- రేవంత్ రెడ్డి మధ్య ఇదంతా పొత్తుకు నిదర్శనం..
కరోనా సమయం వరకు నాకు నియోజకవర్గంలో ఐదుగురు అన్నలు ఉన్నారు.. ఒక్కో మండలంలో ఒక్కో అన్న ఉన్నాడు చాలా సందర్భాల్లో రోజా చెప్పారని.. అలాంటి అన్నలు ఇప్పుడు నీకు ఎందుకు దూరమయ్యారు..? ఎవరి వల్ల దూరమయ్యారో చెప్పాలని నిలదీశారు. దానికి కారణం విశ్లేషించుకోకుండా.. మమ్మల్ని దూరం పెట్టారు. మేం ఉంటే.. మీకు, మీ అన్నదమ్ముల అక్రమ సంపాదను ఇబ్బంది అనే క్రమంగా మమ్మల్ని దూరం పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేవారు.. ఇక, మీడియాతో మాట్లాడిన మంత్రి ఆర్కే రోజా వ్యతిరేక వర్గం.. ఇంకా ఎలాంటి విషయాలు చెప్పుకొచ్చారు తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..