తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావును ఉద్దేశించి ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఉద్యమం పేరిట చంద్రబాబు పంపిస్తే హైదరాబాద్ నుంచి వచ్చాడని కేశినేని తెలిపారు. అప్పుడు చంద్రబాబు చెబితే తానే ఆయనను మూడు నెలలు హోటల్లో పెట్టానని.. అతని అరాచకాలు భరించలేక హోటల్ వారే గగ్గోలు పెట్టేవారని ఆయన చెప్పారు.
మంగళవారం రోజు మంత్రి గుమ్మనూరు జయరాం.. తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.. ఇవాళ లేదా రేపు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి జయరాం రాజీనామా చేస్తారని సమాచారం. ఇవాళ రాత్రికే విజయవాడ చేరుకోనున్నారట గుమ్మనూరు.. ఇక, అల్లూరు నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలను కూడా తనతోపాటు విజయవాడకు ఆహ్వానించారట
కృష్ణా జిల్లాలోని గుడివాడలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీగా మైనార్టీలు చేరారు. ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో , వైయస్ఆర్సీపీలో 500 మంది టీడీపీకి మైనార్టీలు జాయిన్ అయ్యారు.
చిత్తూరు జిల్లాలో కీలకమైన రాజకీయాలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరు నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే ఆరిణి శ్రీనివాసులు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ నిజంగా వామనుడే.. బలి చక్రవర్తి చంద్రబాబును పవన్ తొక్కబోతున్నాడు.. అది బాబు గమనించాలని ఎద్దేవా చేశారు.