Penamaluru Politics: పెనమలూరు నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కాయి. పెనమలూరు టీడీపీలో అసంతృప్తులకు గాలం వేస్తున్నారు మంత్రి జోగి రమేష్. బోడే ప్రసాద్ అనుచరులతో మంత్రి జోగి రమేష్ టచ్‌లోకి వెళ్తున్నట్లు సమాచారం. బోడే ప్రసాద్‌కు టికెట్ రాకపోతే తనకు సహకరించాలని రాయబారాలు పంపుతున్నట్లు తెలిసింది. అయితే జోగి రమేష్ దూకుడుతో అలర్ట్ అయిన పెనమలూరు టీడీపీ నేతలు బలప్రదర్శన చేద్దామని బోడే ప్రసాద్‌పై ఒత్తిడి తెస్తున్నారు.
మరో వైపు నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టే ఆలోచనలో మరో నేత ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి చంద్రబాబును కలిసేందుకు తుమ్మల చంద్రశేఖర్ ప్లాన్ చేస్తున్నారు. అటు మైనార్టీ నేతల ద్వారా సీటుపై క్లారిటీ ఇవ్వాలని అధిష్ఠానం దగ్గరకు వెళ్లనున్నారు ఎం.ఎస్.బేగ్. ఇదిలా ఉంటే మైలవరం సీటు గురించి తేలేవరకు పెనమలూరుపై స్పందించకూడదని దేవినేని ఉమ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
Read Also: AP High Court: టెట్, టీఆర్టీ పరీక్ష షెడ్యూల్ మార్చాలని ఏపీ హైకోర్టు ఆదేశం
పెనమలూరులో కమ్మ లేదా మైనార్టీ వర్గానికి సీటిచ్చే దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం నుంచి దేవినేని ఉమా, బోడే ప్రసాద్, తుమ్మల చంద్రశేఖర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక మైనార్టీ వర్గం నుంచి ఎం.ఎస్ బేగ్ పేరుతో సర్వే నిర్వహిస్తున్నారు. మరోవైపు పెనమలూరు నియోజకవర్గంలో ఓట్లను గణాంకాల వారీగా జల్లెడ పట్టి సర్వేలను టీడీపీ అధిష్ఠానం చేయిస్తోంది. వైసీపీ నుంచి బీసీకి చెందిన మంత్రి జోగి రమేష్ ఖరారు కావడంతో వీలైనంత త్వరగా ఇక్కడ అభ్యర్దిని ఖరారు చేయాలని పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. మంత్రి జోగి రమేష్ ప్రత్యర్థిగా ఎవరు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.