మంగళవారం రోజు మంత్రి గుమ్మనూరు జయరాం.. తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.. ఇవాళ లేదా రేపు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి జయరాం రాజీనామా చేస్తారని సమాచారం. ఇవాళ రాత్రికే విజయవాడ చేరుకోనున్నారట గుమ్మనూరు.. ఇక, అల్లూరు నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలను కూడా తనతోపాటు విజయవాడకు ఆహ్వానించారట
కృష్ణా జిల్లాలోని గుడివాడలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీగా మైనార్టీలు చేరారు. ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో , వైయస్ఆర్సీపీలో 500 మంది టీడీపీకి మైనార్టీలు జాయిన్ అయ్యారు.
చిత్తూరు జిల్లాలో కీలకమైన రాజకీయాలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరు నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే ఆరిణి శ్రీనివాసులు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ నిజంగా వామనుడే.. బలి చక్రవర్తి చంద్రబాబును పవన్ తొక్కబోతున్నాడు.. అది బాబు గమనించాలని ఎద్దేవా చేశారు.
ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఉద్యోగం చేస్తున్న వాలంటీర్లపై ప్రతిపక్షాలు దారుణంగా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల విషయంలో విషం చిమ్ముతున్నారన్న ఆయన.. అర్హులను సచివాలయ అధికారులే ఎంపిక చేశారన్నారు.
మేదరమెట్ల జాతీయ రహదారి పక్కన 4వ చివరి సిద్దం మహాసభ నిర్వహిస్తున్నామని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సిద్ధం సభ అనంతరం ఎన్నికల ప్రచారం మెుదలవుతుందన్నారు.
ముద్రగడ పద్మనాభం కుటుంబం రాజకీయ భవితవ్యంపై తర్జన భర్జన జరుగుతోంది. ముద్రగడ కుమారుడు గిరికి వైసీపీ పెద్దలు టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి వచ్చిన ప్రపోజల్‌పై ముద్రగడ కుమారుడు గిరి తన తండ్రితో చర్చించారని తెలిసింది.
హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరానని తెలిపారు.