వైసీపీ అభ్యర్థుల గురించి ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా ప్రస్తుతానికి సమన్వయకర్తలు మాత్రమేనని.. తుది జాబితాలో చోటు దక్కిన వాళ్లే అభ్యర్థులు అని ఆయన తేల్చి చెప్పారు.
టీడీపీ-జనసేన జాబితాపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ-జనసేన పొత్తులో బలహీనత కనిపిస్తోందని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ దయనీయంగా మారారని.. చంద్ర బాబు ఏది పడిస్తే దానికి పవన్ తృప్తి పడడం అలవాటు అయ్యిందని ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. కొల్లు రవీంద్ర ఓటమి భయంతో సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారని పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. పాపపు సొమ్ముతో చండి యాగాలు, పూజలు చేయడం కాదని.. 3 స్తంభాల సెంటర్ నుంచి బైపాస్ రోడ్లో పేదలకు స్థలాలు ఇచ్చింది నా తండ్రి పేర్ని కృష్ణమూర్తి అని ఆయన పేర్కొన్నారు.
టీడీపీ- జనసేన కలయిక రాజకీయ లబ్ది కోసం కాదు.. భావి తరాల అభివృద్ధి కోసం అని పేర్కొన్నారు. జగన్ పరిపాలనపై విసిగిపోయిన ప్రజల గళాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వినిపిస్తారు.. పేదలకు పెత్తందార్లకు యుద్ధం అంటున్న సీఎం ఎందుకు ప్రజల సొమ్ముతో రెండు హెలికాప్టర్ లు పెట్టుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. ఏ కారణంతో డబ్బులు వృదా చేస్తున్నారు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతి పక్షాలను విమర్శించడానికి ఉపయోగించుకున్నారు అని నాదేండ్ల మనోహర్ ఆరోపించారు.
నేను ఏమైనా అడిగితే నన్ను సవాల్ చేస్తావా అంటాడు కానీ.. తాను చేసిన మంచిని మాత్రం చెప్పడం లేదన్నారు. ఆయన ఏం చేయలేదు కాబట్టి ఏమీ చెప్పలేడు.. మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు భార్య మా ఆయన సిద్దంగా లేడు అంటుంది అని జగన్ అన్నారు.
ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. ప్రజల వద్దకే పాలన కల్పన జగన్ తోనే సాధ్యం అయిందన్నారు. విలేజ్ క్లినిక్ ల ద్వారా ప్రజా ఆరోగ్యం భద్రత కల్పించిన జగన్.. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన జగన్ ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు.