MP Vijayasai Reddy: వైసీపీ తొమ్మిదో జాబితాలో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి పేరును పార్టీ అధిష్టానం ప్రకటించిన విషయం విదితమే.. అయితే, ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సాయిరెడ్డిని అనూహ్యంగా లోక్‌సభ ఎన్నికల బరిలో దింపారు ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ పరిణామాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన విజయసాయిరెడ్డి.. అసలు తాను ఎన్నికల్లో పోటీ చేస్తాను అనుకోలేదన్నారు. అయితే, నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి గెలుస్తాను అనే ధీమా వ్యక్తం చేశారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు. మరోవైపు.. అభ్యర్థుల మార్పులు, చేర్పులపై స్పందిస్తూ.. పనితీరు సరిగ్గా లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను వైసీపీ పక్కన బెట్టిందన్నారు. ముందుగా నెల్లూరు లోక్‌సభ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని పోటీకి సిద్ధం చేశామన్న ఆయన.. మారిన రాజకీయ పరిణామాల్లో నేను పోటీలో ఉంటున్నాను అన్నారు. అయితే, తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని అనుకోలేదు.. కానీ, పార్టీ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యులు, నెల్లూరు సమన్వయకర్త విజయసాయిరెడ్డి. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో సాయిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..