ఏపీలో వైసీపీ ఇంజిన్ ఒకటే.. అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఇంజిన్లతో పని లేదు.. ఇంజిన్ కన్నా శరవేగంగా దూసుకుపోగల సత్తా జగనన్నది అని మార్గాని భరత్ అన్నారు.
పెన్షన్లు పేరుతో జగన్ రాజకీయం చేస్తున్నారు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు వృద్ధులను ఎండలో నిలబెట్టారు.. ఇక, వాలంటీర్ల వ్యవస్థే లేదంట అనే వార్త బయటకు వచ్చింది.. వాలంటీర్ల వ్యవస్ఖను రద్దు చేస్తూ రహస్య జీవో ఏమైనా తెచ్చారా..? అని ప్రశ్నించారు.
త్వరలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నాను అని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే గౌరవం ఉంది.. నా భావ జాలానికి టీడీపీతో కలిసి ప్రయాణించలేకపోయాను అని పేర్కొన్నారు.
పల్నాడు జిల్లాకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేరుకుంది. చీకటీగల వారి పాలెం దగ్గర ప్రకాశం జిల్లా నుంచి పల్నాడు జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది.
అధికారాన్ని కోల్పోవడం ఖాయమని తెలిసాక వైసీపీ రౌడీమూకలకు నిద్రపట్టడం లేదు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా విమర్శలు గుప్పించారు. అందుకే పిచ్చెక్కి అర్థరాత్రి సమయంలో పల్నాడు జిల్లా, క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు అని మండిపడ్డారు.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ది చెందిందని ప్రశాంత్ కిషోర్ డబ్బా కొడుతున్నాడు.. చంద్రబాబు అన్ని రంగాలని మేనేజ్ చేసేవాడు. అందుకే ఆయన హయాంలో అన్ని రంగాలు వెనకపడ్డాయి అని విమర్శించారు.