Minister Seethakka: హమాలీలకు హెల్త్ కార్డ్, ఇన్సూరెన్స్.. మంత్రి సీతక్క కీలక నిర్ణయం..
- హమాలీ కార్మికులకు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్..
- హమాలీ సంఘ భవనాల కోసం భూమి కేటాయింపు..
- సంక్షేమ బోర్డు ఏర్పాటు పై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్న మంత్రి సీతక్క..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సమాజ నిర్మాణంలో తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడే హమాలీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. ఈ సభలో మంత్రి ప్రధానంగా హమాలీ కార్మికుల ఆరోగ్య భద్రతపై దృష్టి సారించారు. నిరంతరం శారీరక శ్రమతో కూడిన పని చేసే హమాలీలకు మెరుగైన వైద్యం అందేలా ‘హెల్త్ కార్డులు’ మంజూరు చేసే అంశాన్ని.. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read:Indiramma Canteen: రూ.5కే భోజనం.. గ్యాస్ ఇబ్బంది అస్సలే లేదు..
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఈ హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ , ప్రత్యేక ‘సంక్షేమ బోర్డు’ ఏర్పాటుపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి త్వరితగతిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. గ్రామాల్లో, మండల కేంద్రాల్లో పనిచేసే హమాలీలకు కనీసం కూర్చునేందుకు కూడా సరైన స్థలం లేకపోవడంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో హమాలీ సంఘాల భవనాల కోసం భూమిని కేటాయించే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. హమాలీల సంక్షేమం కోసం తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల (CDF) నుంచి రూ. 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి కార్మికుల్లో ఉత్సాహం నింపారు. ఈ సమస్యలను అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తానని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!