Ration Card Holders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. మార్చి 17 వరకు అవకాశం..
- ఈ నెల రేషన్ బియ్యం పంపిణీ గడువు మార్చి 17..
- ఏప్రిల్‌లో మూడు నెలల బియ్యం..
- సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా పేదలకు అందే రేషన్ బియ్యం తెలంగాణలో కీలకమైన సంక్షేమ పథకం. సాధారణంగా ప్రతి నెలా 15వ తేదీ వరకు మాత్రమే బియ్యం తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ.. సాంకేతిక సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల బియ్యం తీసుకోలేకపోయిన లబ్ధిదారుల కోసం ప్రభుత్వం తాజాగా గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
మార్చి 17 వరకు బియ్యం తీసుకోవచ్చు..
ప్రస్తుత మార్చి నెలకు సంబంధించి రేషన్ పంపిణీ గడువు ఈ రోజుతో (మార్చి 15) ముగియాల్సి ఉంది. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా చాలా మంది లబ్ధిదారులు బియ్యం తీసుకోలేదని గుర్తించిన ప్రభుత్వం, మరో రెండు రోజుల పాటు గడువును పొడిగించింది. దీని ప్రకారం.. రేషన్ కార్డుదారులు మార్చి 17వ తేదీ వరకు తమకు దగ్గర్లో ఉన్న రేషన్ డీలర్ల వద్ద బియ్యం తీసుకోవచ్చు. ఈ వెసులుబాటును వినియోగించుకోవాలని పౌరసరఫరాల శాఖ సూచించింది.
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఏప్రిల్‌లో ‘త్రిపుల్’ ధమాకా..
వచ్చే నెల ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి మూడు నెలల రేషన్‌ను (ఏప్రిల్, మే, జూన్) పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున.. వృద్ధులు, మహిళలు ప్రతి నెలా క్యూలైన్లలో నిలబడి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అమలవుతున్న ‘సన్నబియ్యం’ పథకం కింద ప్రతి లబ్ధిదారునికి నెలకు 6 కిలోల చొప్పున.. మూడు నెలలకు కలిపి ఒకేసారి 18 కిలోల బియ్యం అందజేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ‘సన్నబియ్యం’ పథకం దాదాపు 3.10 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తోంది.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!