Memantha Siddham Bus Yatra: 13వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఈ రోజు షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Memantha Siddham Bus Yatra: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. మండుటెండను లెక్క చేయకుండా జగన్ ముందుకు కదులుతున్నారు. ఆయన్ను చూసేందుకు జనం పెద్దయెత్తన రోడ్లపైకి వస్తూ ఎదురుచూస్తున్నారు. ఇవాళ 13వ రోజు గుంటూరు జిల్లా ధూళిపాళ్ల నుంచి యాత్ర ప్రారంభవుతోంది. రంజాన్ తో నిన్న ఒకరోజు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. 12వ రోజు పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం నుంచి బయలుదేరి బస్సు యాత్ర పిడుగురాళ్ల వరకు అక్కడ నుంచి ధూళిపాళ్ల వరకు కొనసాగింది. అక్కడే జగన్ బస చేశారు సీఎం జగన్.
Read Also: Janata Bar Movie: హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న రాయ్ లక్ష్మీ.. హీరో ఎవరంటే?
Also Read
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
- Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
ఇక, ఈ రోజు ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల బస నుంచి సీఎం వైఎస్ జగన్ బయలుదేరుతారు. సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు దగ్గరకు చేరుకుంటారు. ఆ తర్వాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఏటుకూరు బైపాస్ చేరుకుంటారు. అక్కడ జరిగే మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. సభ తర్వాత తక్కెలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్ రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా యాత్ర సాగుతుంది. నంబూరు బైపాస్ దగ్గర బస చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
తాజావార్తలు
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?