RCB Player: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆర్సీబీ క్రికెట్ ప్లేయర్..
- యష్ దయాల్ రహస్య వివాహం..
- గ్రేటర్ నోయిడాలో కుటుంబ సమక్షంలో పెళ్లి..
- వివాదాల మధ్య బెయిల్ పొందిన దయాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు స్టార్ పేసర్ యష్ దయాల్ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. మైదానంలో తన బౌలింగ్‌తో కంటే, వ్యక్తిగత జీవితంలోని వివాదాలు.. తాజాగా ఆయన రహస్య వివాహం గురించి విశేషాలే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. యష్ దయాల్ ఐపీఎల్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత ఏడాది కాలంగా ఆయనపై లైంగిక వేధింపుల వంటి తీవ్రమైన ఆరోపణలు రావడంతో కొంతకాలం క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ కారణం చేతనే ఆయన యూపీ టీ-20 లీగ్ 2025లో కూడా పాల్గొనలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పెళ్లి వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read:Gen Z: భారతీయ వ్యాపార రంగంలో ‘జెన్ జీ’ ప్రభంజనం.. భవిష్యత్తు మార్కెట్ అంచనాలు ఇవే..
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
యష్ దయాల్ వివాహం ఫిబ్రవరి 4వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగినట్లు సమాచారం. అయితే ఈ వివాహం గురించి నెల రోజుల వరకు బయటి ప్రపంచానికి తెలియకపోవడం విశేషం. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. క్రికెటర్లు కానీ, స్నేహితులు కానీ ఎవరూ ఈ పెళ్లికి హాజరు కాలేదు. యష్ దయాల్ వివాహం చేసుకున్న యువతి పేరు శ్వేత పుండిర్. ఆమె వృత్తిరీత్యా ఒక కంటెంట్ క్రియేటర్. ఇటీవల సోషల్ మీడియాలో యష్‌తో కలిసి ఆమె చేసిన ఒక రీల్ వైరల్ అవ్వడంతో వీరి బంధంపై స్పష్టత వచ్చింది.
Also Read:Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త.. ఈనెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు
జనవరి 2026లో యష్ దయాల్ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక మహిళను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. కింది కోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించడంతో అరెస్ట్ భయం నెలకొంది. అయితే… రాజస్థాన్ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో పెద్ద ఊరట లభించింది. ఈ న్యాయపరమైన చిక్కుల వల్ల ఆయన కెరీర్ ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ఈ బెయిల్ ఆయనకు మేలు చేసింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో యష్ దయాల్ ఆడతారా లేదా అనే సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను పక్కన పెట్టి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన యష్ దయాల్.. తిరిగి మైదానంలోకి ఎప్పుడు వస్తారో అని అభిమానులు వేచి చూస్తున్నారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!