కొనకనమిట్ల మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో మంచి జరుగుతోందని గీతాంజలి చెప్పడమే ఆమె చేసిన పాపమని.. తన మనుషులతో సోషల్‌మీడియాలో గీతాంజలిని వేధించి చంపారని ఆయన ఆరోపించారు. 20 జెలొసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గని కడుపుమంట చంద్రబాబులో కనిపిస్తోందన్నారు.
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల 'మేమంతా సిద్ధం' బహిరంగ సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొదిలిలో బిందువు బిందువు చేరి సిందువు అయినట్లు జనసంద్రం కనిపిస్తుందని.. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా ప్రతీ సిద్ధం అంటున్నారన్నారు. ప్రజల అజెండాతో మనం, జెండాలు జత కట్టి వాళ్లు వస్తున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉలగించినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య ఎలక్షన్ కమిషన్ సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు అందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ నోటీసుల అందించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి తన ప్రసంగాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు పై చర్యల నేపథ్యంలో శివ ముఖేష్ కుమార్ మీనా జగన్…
గతంలో పొరుగు రాష్ట్రాలు చూడడానికి వెళ్లామని, ఇప్పుడు పొరుగు రాష్ట్రాలు మన ప్రభుత్వం వైపు చూసి వెళ్తున్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట శిరికి రిసార్ట్స్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్.కోట మండల స్థాయి విస్తృత సమావేశంలో ముఖ్యఅతిధిగా మంత్రి పాల్గొన్నారు.
పెమ్మసాని మాట్లాడుతూ.. అయితే, వ్యాపారస్తులు లేదా సహజ వనరులే లక్ష్యంగా కొందరు రాజకీయ నాయకులు దండుకుంటున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.