Gen Z: భారతీయ వ్యాపార రంగంలో ‘జెన్ జీ’ ప్రభంజనం.. భవిష్యత్తు మార్కెట్ అంచనాలు ఇవే..
- 2030 నాటికి భారత వినియోగ మార్కెట్‌లో జెన్ జీ ప్రభావం..
- అందం, ఫ్యాషన్, ఫిట్‌నెస్ రంగాల్లో పెరగనున్న ఖర్చులు..
- డిజిటల్ సౌకర్యాలకు జెన్ జీ అధిక ప్రాధాన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ భవిష్యత్తును మార్చబోతున్న సరికొత్త తరం ‘జెన్ జీ’ (Gen Z) గురించి రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ సంస్థ ఆసక్తికరమైన నివేదికను విడుదల చేసింది. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని ‘జెన్ జీ’ అని పిలుస్తారు. వీరు మన దేశ ఆర్థిక వ్యవస్థను.. ముఖ్యంగా కొనుగోలు రంగాలను ఎలా ప్రభావితం చేయబోతున్నారో తెలుసుకుందాం.
భవిష్యత్తుపై అంచనా..
2030 నాటికి భారతదేశ జనాభాలో 27 శాతం మంది ఈ ‘జెన్ జీ’ తరానికి చెందిన వారే ఉంటారు. వీరు సుమారు 1.3 ట్రిలియన్ డాలర్ల (లక్షల కోట్లు) విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారని అంచనా. వీరు కేవలం వస్తువులకే కాకుండా.. అనుభవాలకు, పర్యావరణ హితానికి, డిజిటల్ సౌకర్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
Also Read
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
2030 నాటికి ఈ రంగంలో వీరు 19 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను సృష్టిస్తారు. ప్రతి ఇద్దరు ‘జెన్ జీ’ యువతులలో ఒకరు తమ సంపాదనలో 20 శాతానికి పైగా అందాన్ని మెరుగుపరిచే వస్తువులకే ఖర్చు చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు వీరు వాడుతున్న వస్తువుల సంఖ్య రెట్టింపు అయ్యింది. చర్మం, జుట్టు , శరీరం కోసం వేర్వేరు పద్ధతులను పాటిస్తున్నారు. వీరు ఒకే బ్రాండ్‌కు కట్టుబడి ఉండకుండా.. తమకు ఏది బాగా పని చేస్తుందో వాటినే ఎంచుకుంటున్నారు. అందం అనేది కేవలం మహిళలకే పరిమితం కాదని ఈ తరం భావిస్తోంది. గత ఐదేళ్లలో ‘పురుషుల చర్మ సంరక్షణ’ కోసం వెతికే వారి సంఖ్య 850 శాతం పెరిగింది. యువకులు కూడా మొటిమల నివారణ, హెయిర్ రిమూవల్, మేకప్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read:Minister Seethakka: హమాలీలకు హెల్త్ కార్డ్, ఇన్సూరెన్స్.. మంత్రి సీతక్క కీలక నిర్ణయం..
ఫ్యాషన్ రంగం..
2030 నాటికి ఫ్యాషన్ రంగంలో సగం వాటా వీరిదే ఉంటుంది. వీరు ఎక్కువగా 1,000 రూపాయల లోపు లభించే దుస్తులు, పాదరక్షలనే ఇష్టపడుతున్నారు. పాత తరం వారితో పోలిస్తే వీరు వస్తువులను ఎక్కువగా కొంటున్నప్పటికీ, ఒక్కో వస్తువుపై పెట్టే ఖర్చు మాత్రం తక్కువగా ఉంటోంది.
ఆరోగ్యం, ఫిట్‌నెస్..
ఈ తరంలో మూడో వంతు మంది తమ ఆదాయంలో 20 శాతాన్ని ఫిట్‌నెస్, క్రీడల కోసం కేటాయిస్తున్నారు. ముఖ్యంగా క్రీడా దుస్తుల అమ్మకాలు ఏడాదికేడాది రెట్టింపు అవుతున్నాయి. ఆన్‌లైన్‌లో తక్కువ ధరలో దొరికే స్పోర్ట్స్ షూస్ వీరికి మొదటి ప్రాధాన్యత. ఆహారం విషయంలో కూడా వీరు జాగ్రత్తగా ఉంటున్నారు. వ్యాయామం చేసే వారిలో 40 శాతం మంది ప్రత్యామ్నాయ ప్రోటీన్ వనరులను ఎంచుకుంటున్నారు. మొత్తంగా.. 2030 నాటికి ఫిట్‌నెస్ , క్రీడల రంగంలోనే వీరు 40 బిలియన్ డాలర్ల ఖర్చును ప్రభావితం చేస్తారు. ఈ తరం కేవలం కొనుగోలుదారులు మాత్రమే కాదు.. మార్కెట్ దిశను మార్చే శక్తిగా ఎదుగుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..